Advertisementt

బిగ్ బాస్ 5: వార్ వన్ సైడ్, విన్నర్ ఫిక్స్

Sat 18th Dec 2021 03:21 PM
bigg boss telugu 5,bigg boss,big boss season 5 winner,vj sunny,rajamouli,nagarjuna  బిగ్ బాస్ 5: వార్ వన్ సైడ్, విన్నర్ ఫిక్స్
Bigg Boss 5: War One Side, Winner Fix బిగ్ బాస్ 5: వార్ వన్ సైడ్, విన్నర్ ఫిక్స్
Advertisement
Ads by CJ

 

బిగ్ బాస్ సీజన్ చివరి అంకానికి అంటే గ్రాండ్ ఫినాలే కి టైం దగ్గర పడింది. మరొక్క రోజులో టాప్ 5 లో ఉన్న సన్నీ, షణ్ముఖ్, సిరి, మానస్, శ్రీరామ్ లలో విన్నర్ ఎవరో తేలిపోతుంది. ఇప్పటికే ఓటింగ్ లైన్స్ కూడా క్లోజ్ అయ్యాయి. గత ఆదివారం రాత్రి తెరుచుకున్న ఓటింగ్ లైన్ నిన్న అర్ధరాత్రితో ముగిసాయి. ఆల్మోస్ట్ బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ పై ఓటింగ్స్ తోనే ఓ క్లారిటీ వచ్చేసింది. బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ గా ఓటింగ్ లో విజె సన్నీనే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. మొదటి నుండి ఓటింగ్ లో సత్తా చాటుతున్న సన్నీ.. మధ్యలో షణ్ముఖ్, శ్రీరామ్ కన్నా కొద్దిగా వెనకబడిన.. ఓవరాల్ గా సన్నీ కే ఓట్స్ ఎక్కువ వచ్చాయని, అటు ఓటింగ్, ఇటు హౌస్ లో ఎంటర్టైన్మెంట్ పరంగా సన్నీనే విజేత అవుతాడని ఇప్పటికే చాలామంది ఊహించేసారు.

ఫైనల్ గా సన్నీ బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ గా షణ్ముఖ్ ఓటింగ్ లో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు కాబట్టి.. రన్నర్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయని, శ్రీరామ్ చంద్ర కూడా గట్టి పోటీ ఇచ్చినా బయట ఓటింగ్ పరంగా థర్డ్ ప్లేస్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది అని, మానస్ మొదటి నుండి నాలుగో స్థానాల్లో కొనసాగుతున్నాడు. సిరి ఐదో స్థానంలోనే ఉంది. ఇక వార్ వన్ సైడ్ అన్నట్టుగా వీజే సన్నీ.. బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్ ఫినాలే విన్నర్ గా అవతరించబోతున్నాడని.. రేపు రాత్రి సన్నీ నే విన్నర్ అని నాగార్జున వేదికపై ప్రకటించబోతున్నారని తెలుస్తుంది. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకి అలియా భట్, రణబీర్ కపూర్, కరణ్ జోహార్ లు అంటే బ్రహ్మాస్త్ర టీం గెస్ట్ లుగా హాజరవ్వబోతున్నారు. సో వాళ్ళ చేతుల మీదుగా సన్నీ బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ రివీల్ అవుతాడన్నమాట.

Bigg Boss 5: War One Side, Winner Fix:

Bigg Boss Telugu 5: War One Side

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ