Advertisementt

బిగ్ బాస్ 5: విన్నర్ ఫిక్స్.. రన్నర్ లో ట్విస్ట్

Sun 19th Dec 2021 11:03 AM
bigg boss telugu 5,bigg boss,nagarjuna,vj sunny,sunny bigg boss winner  బిగ్ బాస్ 5: విన్నర్ ఫిక్స్.. రన్నర్ లో ట్విస్ట్
Bigg Boss 5: Winner Fix, Twist in Runner బిగ్ బాస్ 5: విన్నర్ ఫిక్స్.. రన్నర్ లో ట్విస్ట్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్ ఫినాలే డే.. సన్ డే వచ్చేసింది. ఈ రోజు డిసెంబర్ 19న బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్ ఫినాలే జరగబోతుంది. అక్కినేని నాగార్జునా ఫినాలే పై అంచనాలు పెంచే ప్రోమో రిలీజ్ చేసింది స్టార్ మా. అయితే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ని స్టార్ మా శనివారమే సగం పూర్తి చేసింది అని, అందులో ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ చాలామంది డాన్స్ ప్రోగ్రామ్స్ లో అలరించగా.. సిరి హన్మంత్ ముందుగా టాప్ 5 నుండి ఎలిమినేట్ అయ్యింది అని, తర్వాత నాలుగు స్థానాల్లో ఉన్న మానస్ ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తుంది. దానితో టాప్ 3 లో సన్నీ, షణ్ముఖ్, శ్రీరామ్ మిగిలారు అని అంటున్నారు. ఇక గ్రాండ్ ఫినాలేకి గెస్ట్ లుగా నాని, కృతి శెట్టి అంటే శ్యామ్ సింగ రాయ్ టీం హాజరైంది అంటున్నారు.

అలాగే అలియా భట్, రణబీర్ కపూర్ కూడా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే గెస్ట్ లుగా వచ్చారని, ఇంకా మరిన్ని సర్ ప్రైజ్ లు గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో కనిపించబోతున్నాయని తెలుస్తుంది. అయితే మొదటి నుండి ఓటింగ్ లో ఫస్ట్ లో ఉన్న సన్నీ నే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే విన్నర్ అని, కానీ రన్నర్ విషయంలో భారీ ట్విస్ట్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు ఓటింగ్ లో సెకండ్ ప్లేస్ లో ఉన్న షణ్ముఖ్ జస్వంత్ రన్నరప్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంతా అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు బిగ్ బాస్ వర్గాల నుంచి అందుతోన్న సమాచారం ప్రకారం.. శ్రీరామ చంద్ర గత వారం జరిగిన ఓటింగ్‌లో అనూహ్యంగా సెకెండ్ ప్లేస్‌ కి రావడంతో.. అతను రన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్లుగా టాక్ బయటికి వచ్చింది. ఆల్మోస్ట్ ఈరోజు జరగనున్న గ్రాండ్ ఫినాలేలో శ్రీరామ్ రన్నరప్‌గా నిలవబోతున్నాడని తెలుస్తోంది.

Bigg Boss 5: Winner Fix, Twist in Runner:

Bigg Boss Telugu 5: VJ Sunny Winner

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ