Advertisementt

ఊరించి ఊరించి ఉసూరుమనిపించిన బిగ్ బాస్

Sun 19th Dec 2021 10:38 PM
bigg boss 5,bigg boss telugu,bigg boss grand finale,sunny,shanmukh,nagarjuna,pushpa director sukumar,heroine rashmika mandanna,ayan mukherjee,ranbir kapoor,shyam singha roy  ఊరించి ఊరించి ఉసూరుమనిపించిన బిగ్ బాస్
Bigg Boss 5 grand finale concludes in style ఊరించి ఊరించి ఉసూరుమనిపించిన బిగ్ బాస్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ ఫైవ్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ని.. ఓ రేంజ్ లో ప్లాన్ చెయ్యడమే కాదు.. అదిరిపోయే గెస్ట్ లతో బుల్లితెర ప్రేక్షకులు బిగ్ బాస్ చూస్తూండేలా ప్లాన్ చేసింది స్టార్ మా. దానిలో భాగంగా సీజన్ 5 గ్రాండ్ ఫినాలేకి.. బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు అతిధుల రాక.. హౌస్ మేట్స్ కే కాదు.. బుల్లితెర ప్రేక్షకులు కూడా సూపర్ సర్ ప్రైజ్ అయ్యారు. బాలీవుడ్ నుండి అలియా భట్, రణబీర్ కపూర్, అయాన్ ముఖర్జీ, టాలీవుడ్ నుండి రాజమౌళి, సుకుమార్, రష్మిక, శ్రియ డాన్స్ పెరఫార్మెన్స్, నాని, శ్యామ్ సింగరాయ్ టీం, సాయి పల్లవి, కృతి శెట్టి, నాగ చైతన్య.. ఆఖరికి బంగార్రాజు ఐటెం భామ ఫారియా అబ్దుల్లా అంటూ బిగ్ బాస్ స్టేజ్ కళకళలాడింది.

అయితే అంతా బాగానే ఉంది.. ఫైనల్ గా సన్నీ - షణ్ముఖ్ టాప్ 2 లో ఉన్నారు. వారిలో బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ ఎవరు అవుతారు? ఆ విన్నర్ ని ఎవరు ప్రకటిస్తారో అనే దాని మీద అందరూ ఎంతో ఉత్సుకతతో ఎదురు చూసారు .. కానీ చివరికి నాగార్జున బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి సన్నీ - షణ్ముఖ్ లతో మాట్లాడి.. వాళ్ళని బయటికి తీసుకువచ్చి.. ఏ సెలెబ్రిటీ చేతుల మీదో ట్రోఫీ ఇప్పిస్తారనుకుంటే.. బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ ని హోస్ట్ నాగార్జునే సింపుల్ గా డిసైడ్ చేసి ప్రకటించేసారు. సన్నీ - షణ్ముఖ్ లలో సన్నీ విన్నర్ గాను, షణ్ముఖ్ ని రన్నర్ గా ప్రకటించారు నాగ్. కానీ ఫైనల్ విన్నర్ ని మెగాస్టార్ అయినా, బాలయ్య అయినా రివీల్ చేస్తే అదిరిపోయేదని ఫాన్స్ అనుకున్నారు. కానీ బిగ్ బాస్ ఊరించి ఊరించి ఉసూరుమనిపించాడు.

Bigg Boss 5 grand finale concludes in style:

Bigg Boss 5 grand finale: Sunny wins the coveted crown

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ