Advertisementt

హిట్ అయినా ఆనందం లేదేం..?

Mon 20th Dec 2021 10:37 PM
pushpa,pushpa hit,pushpa makers,allu arjun,arjun,rashmika mandanna,collections  హిట్ అయినా ఆనందం లేదేం..?
Even with the Hit, But Not Happy హిట్ అయినా ఆనందం లేదేం..?
Advertisement
Ads by CJ

మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు సోమవారం పుష్ప సినిమా గురించి మరొక మీడియా సమావేశం నిర్వహించారు. ఇది రెండోదో, మూడో సమావేశం కానీ సినిమా రిలీజ్ అయి ఇంకా నాలుగు రోజులు కూడా కాలేదు, అప్పుడే నిర్మాతల మీద బాగా ఒత్తిడి పెరిగినట్టుంది. ఆ సినిమా కలెక్షన్స్ గురించి ఎక్కువ చెప్పమని, మూడు రోజుల్లో 173 కోట్లు కలెక్ట్ చేసి ఇండియా లో మా సినిమానే నెంబర్ వన్ అని చెప్పారు నిర్మాతలు. అయితే మరి ఇంత హిట్ అయినా సినిమా ఇచ్చిన నిర్మాతల మొహాల్లో మాత్రం ఒక్క చిన్న చిరునవ్వు కూడా లేదు, ఎందుకో అర్థం కావటం లేదు.

పుష్ప సినిమా హిట్ అయింది, బాగుంది, డబ్బులు కూడా వస్తాయి. కానీ సదరు నిర్మాతల మీద బాగా ఒత్తిడి పెరిగినట్టుంది, అందుకే వాళ్ళు ఈ మీడియా సమావేశం నిర్వహించే ముందు కలెక్షన్ ఎంత చెప్పాలి అనేది వాళ్ళకి మెసేజ్ లు  వస్తాయట. అదే ఫిగర్ వాళ్ళు మీడియా వాళ్ళకి చెప్పాలట. ఇది అందరికి తెలుసు, ఈ నంబర్స్ లో ఫేక్ ఉన్నాయని, మరి అలాంటప్పుడు ఎందుకు ఎక్కువ చెప్పటం. అల్లు అర్జున్ ని పాన్ ఇండియన్ స్టార్ గా ఈ సినిమా తీసుకెళ్లింది, అది కూడా నిజం, కానీ ఇక్కడ కలెక్షన్స్ ఎందుకు అబద్ధం చెప్పటమే అర్థం కావటం లేదు అని వాపోతున్నారు.

Even with the Hit, But Not Happy:

Pushpa Hit, Makers not happy 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ