స్టార్ హీరోలతో అడిపాడి, కమర్షియల్ హీరోయిన్ గా కెరీర్ లో అందనంత ఎత్తుకి ఎదిగి.. తర్వాత ప్రేమ, పెళ్లి, కెరీర్ అంటూ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలతో సత్తా చాటిన సమంత.. గ్లామర్ విషయంలో ఎప్పుడూ ఒకేలా ఉంది. కమర్షియల్ మూవీస్ అయినా, లేడీ ఓరియెంటెడ్ మూవీస్ అయినా, పెళ్లి అయ్యాక కూడా గ్లామర్ విషయంలో సమంత పొదుపు సూత్రం పాటించలేదు. పెళ్లి తర్వాత బికినీ షోస్, బుల్లి బుల్లి బట్టలతో ఎన్నోసార్లు సోషల్ మీడియాలో హల్చల్ చేసింది సమంత. హీరోయిన్ కెరీర్ అంటే.. గ్లామర్, పెరఫార్మెన్స్ ఈ రెండు ముఖ్యం. అందుకే సమంత ఆ రెండిటిలో ఎక్కడా తగ్గేది కాదు.
ఇక తాజాగా సమంత పుష్ప సినిమాలో అల్లు అర్జున్ తో ఊ అంటావా మావా ఊ ఉ అంటావా మావ అంటూ సెన్సేషన్ కి తెర లేపింది. సమంత స్పెషల్ సాంగ్.. పుష్ప థియేటర్స్ లో దుమ్ము రేపుతోంది. మాస్ ఆడియన్స్ సమంత సాంగ్ చూసి మతులు పోగొట్టుకుంటున్నారు. తాజాగా సమంత ఆ స్పెషల్ సాంగ్ పై స్పందించింది. నేను మంచి కేరెక్టర్స్ చేశాను. అలాగే చెడ్డ పాత్రలు చేశాను. గ్లామర్ పరంగాను నటించాను. ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ కి హోస్ట్ గా కూడా చేశాను. అయితే నేను ఏది చేసినా అందులో ది బెస్ట్ ఉండాలనే చాలా కష్టపడ్డాను. అయితే గ్లామర్ గా, సెక్సీగా కనిపించడం అనేది హార్డ్ వర్క్‌లో నెక్ట్స్ లెవల్.. ఇక పుష్ప సినిమాలో ఊ అంటావా మావ..ఉ ఉ అంటావా సాంగ్‌కు ఫాన్స్ చూపిస్తోన్న ఆదరణకు ధన్యవాదాలు అంటూ అల్లు అర్జున్ తో వేస్తున్న మాస్ స్టెప్ ఉన్న ఓ పిక్ ని ఇన్స్టాలో పోస్ట్ చేసింది సమంత.