అక్కినేని నాగార్జున చాలా కూల్ మనిషి, కానీ అప్పుడప్పుడు అతనికి కూడా చాలా కోపం వస్తుంది. కొద్దీ రోజుల కిందట నాగార్జున నటించిన హిందీ సినిమా బ్రహ్మాస్త్ర ప్రొమోషన్ హైదరాబాద్ లో జరిగింది. ఆ మీడియా సమావేశం లో ఒక జర్నలిస్ట్ పదే పదే నాగార్జున ప్లే చేసిన రోల్ విష్ణు మూర్తి గురించి అడిగాడు. దానికి నాగార్జున పెద్దగా సమాధానం అప్పుడు చెప్పలేదు కానీ, ఆ సమావేశం అయిన తరువాత నాగార్జున ఆ సినిమా పి ఆర్ మీద మండిపడ్డారు అని తెలిసింది. ఆలా ఎలా అడుగుతారు, మేము ఏమి రెవీల్ చెయ్యలేదు అన్నారట.
అయితే నాగార్జున విష్ణు మూర్తి అన్న విషయం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది, మరి సదరు జర్నలిస్ట్ ఆ విషయాన్నే అక్కడ అడిగాడు. అయిన కూడా రూమర్స్ వేరు, ఇక్కడ ఆ విషయం గురించి చర్చించటం వేరు అని చెప్పారట. ఏమైనా నాగార్జునకి కూడా కోపం వచ్చే ఉంటుంది. బ్రహ్మాస్త్ర సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతోంది, మన దర్శకుడు రాజమౌళి ఈ సినిమాని దక్షిణాది భాషలు అన్నిటిని సమర్పిస్తున్నారు. రన్బీర్ కపూర్, అలియా భట్ ఇందులో లీడ్ పెయిర్ గా నటిస్తున్నారు. ఈ సినిమా మూడు భాగాలుగా రిలీజ్ అవుతోంది.