ప్రభాస్ రాధేశ్యామ్ తో జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బాహుబలి బ్లాక్ బస్టర్ తో, భారీ క్రేజ్ తో ఉన్న ప్రభాస్ సాహో తో నార్త్ లో సత్తా చాటాడు.. మళ్లీ రాధేశ్యామ్ అంటూ క్యూట్ లవ్ స్టోరీ తో ప్రభాస్ మరోసారి పాన్ ఇండియా ప్రేక్షకులని పలకరించబోతున్నాడు.. ఇప్పటికే రాధేశ్యామ్ నుండి సాంగ్స్, విక్రమాదిత్య టీజర్ యూట్యూబ్ ని ఊపేస్తున్నాయి. యువి క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజ హెగ్డే గ్లామర్ గా రొమాంటిక్ గా కనిపిస్తుంది. అంతేకాకుండా పరమహంశ గా కృష్ణం రాజు చాలా కొత్తగా కనిపిస్తున్నారు.
అయితే ప్రభాస్ అభిమానులే అతిధులుగా రేపు రామోజీ ఫిలిం సిటీలో రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అదిరిపోయే లెవల్లో ప్లాన్ చేసారు మేకర్స్, నేషనల్ వైడ్ గా ప్రభాస్ ఫాన్స్ హాజరవుతున్న ఈ ఈవెంట్ పై ప్రభాస్ ఫాన్స్ పిచ్చ ఆసక్తితో ఉన్నారు. అయితే ఈ ఈవెంట్ లో రభస ఇంకా రాధేశ్యామ్ టీం తప్ప స్పీకర్ గెస్ట్ లెవరూ ఉండరు. కేవలం ఫాన్స్ తప్ప. ఫాన్స్ చేతుల్ మీదుగా ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు . అయితే ఈ ఈవెంట్ కి హోస్ట్ గా ఓ యంగ్ హీరో కనిపించబోతున్నాడని తెలుస్తుంది. జాతి రత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నవీన్ పోలిశెట్టి ప్రభాస్ రాధేశ్యామ్ ఈవెంట్ కి హోస్ట్ గా మారబోతున్నాడని తెలుస్తుంది.
జాతి రత్నాలు ట్రైలర్ లాంచ్ ప్రభాస్ చేతుల మీదుగా జరగగా.. ఇప్పుడు రాధేశ్యామ్ ఈవెంట్ కి హోస్ట్ చేసేసి ప్రభాస్ ఋణం తీర్చుకుంటున్నాడు నవీన్ పోలిశెట్టి.