రాజమౌళి దర్శకత్వం లో వస్తున్న పాన్ ఇండియన్ సినిమా ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ విపరీతంగా చేస్తున్నారు. రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్ టి ఆర్ ఇద్దరు పెద్ద స్టార్స్ ఇందులో కథానాయకులు. రాజమౌళి అయితే సినిమా కంప్లీట్ చేసేసారు. ఎందుకంటే అతనితో సినిమా చెయ్యటం అంటే ఏ హీరోకి అయినా ఇష్టమే. కానీ ఇక్కడ ఒక పెద్ద చిక్కు వచ్చి పడింది. రాజమౌళి నేను వాళ్ళిద్దరిని నటులుగానే చూసి తీసుకున్నా ఆర్ఆర్ఆర్ సినిమాకి అన్నారు. కానీ బయట మాత్రం ఇద్దరి స్టార్స్ ఫాన్స్ హంగామా ఇంత అంత కాదు. హైదరాబాద్ లో ఒక మల్టీప్లెక్స్ లో చెయ్యవలసిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రొమోషన్ ఈవెంట్ ఒకటి ఫాన్స్ వల్ల రసాభాస అయిన సంగతి తెలిసిందే కదా. అలాగే ముంబై లో చరణ్ ఫాన్స్ ఎంత హంగామా చేసారో కూడా తెలిసిందే.
ఐతే ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ టీం హైద్రాబాదు లో ఒక ప్రీ-రిలీజ్ ఈవెంట్ పెట్టాలని యోచిస్తోంది. నిర్మాతకి, ఆర్గనైజర్స్ కి ఇప్పుడు పెద్ద తలనొప్పి పట్టుకుందిట. ఎలా ఈ ఈవెంట్ ని పూర్తి చెయ్యాలి అని. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు స్టార్స్ కి ఎక్కువమంది ఫాన్స్ రావటానికి ఎక్కువ అవకాశం వుంది. ఎటువంటి చిన్న తప్పు జరిగిన ఫాన్స్ మధ్య గొడవలు జరిగి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు దారి తీస్తాయో తెలియదు కదా. ఎంతమందిని సెక్యూరిటీ పెట్టినా, వందల వేల మంది ఫాన్స్ ముందు ఈ సెక్యూరిటీ ఏమి పనికిరాదు. పోనీ చిన్నగా చేయడం అంటే సినిమాకు మైనస్ అవుతుందేమో అని. ఈ ఈవెంట్ డిసెంబర్ 30 న హైద్రాబాదులో వుందా వచ్చు అంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ టీం అంతా చాలా టెన్షన్ గా వున్నారు ఎటువంటి రచ్చ లేకుండా ఈ ఈవెంట్ ఎలా సక్సెస్ చెయ్యాలి అన్న విషయంతో రాజమౌళి టెన్షన్ తో వున్నారు. చూడాలి పక్కాగా ప్లానింగ్ తో వుండే జక్కన్న ఎలా నిర్వహిస్తారో మరి.!