Advertisementt

ఎడిట్ రూమ్ లో బిజీగా ఉన్న నాగార్జున

Thu 23rd Dec 2021 04:16 PM
nagarjuna,banagarraju,sankranti 2022,naga chaitanya,krithi shetty  ఎడిట్ రూమ్ లో బిజీగా ఉన్న నాగార్జున
Nagarjuna busy in the editing room ఎడిట్ రూమ్ లో బిజీగా ఉన్న నాగార్జున
Advertisement
Ads by CJ

నాగార్జున బిగ్ బాస్ పూర్తి చేసారు, ఇప్పుడు తన సినిమా బంగార్రాజు మీద ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల అవుతోంది. అందుకు నాగార్జున తన అన్నపూర్ణ స్టూడియో లో ఎడిట్ రూమ్ లో చాలా బిజీ గా వున్నారు. ఈ సినిమా క్లైమాక్స్ సీన్స్ కొద్దీ రోజుల క్రితమే షూట్ చేసారని తెలిసింది. అలాగే ఈ రోజు లాస్ట్ డే షూట్ అంటూ అందమైన బుల్లి బంగార్రాజు, బుల్లి బంగార్రాని పోస్టర్ తో అప్ డేట్ ఇచ్చారు. కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. ఇది ఇంతకు ముందు తీసిన సోగ్గాడే చిన్ని నాయన కి సీక్వెల్. ఇందులో నాగార్జునతో పాటు పెద్ద కొడుకు నాగ చైతన్య కూడా వున్నారు. కృతి శెట్టి ఇందులో కథానాయికగా చేస్తోంది. రమ్య కృష్ణ కూడా వున్నారు. 

అయితే మొదటి సినిమాలో వున్న లావణ్య త్రిపాఠి ని ఎందుకనో తీసుకోలేదు. మామూలుగా సీక్వెల్ అంటే మొదటి సినిమాలో చేసిన లీడ్ పెయిర్ ని తీసుకుంటారు, కానీ ఇందులో కృతి శెట్టి ని తీసుకున్నారు. నాగార్జున కి సంక్రాంతి సెంటిమెంట్ బాగా కలిసి వచ్చింది, ఎందుకంటే సోగ్గాడే చిన్ని నాయన సంక్రాంతి కె రిలీజ్ అయ్యి నాగార్జున కెరిర్ లో బెస్ట్ గా నిలిచింది. అందుకనే ఇప్పుడు ఈ సీక్వెల్ ని కూడా సంక్రాంతి కి రెండు పెద్ద సినిమాల మధ్యలో రిలీజ్ చేస్తున్నారు. నాగార్జున కూడా ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నారు ఈ సినిమా సక్సెస్ విషయంలో. అల్ ది బెస్ట్ నాగార్జున గారూ!

Nagarjuna busy in the editing room:

Nagarjuna Banagarraju Gears Up For Sankranti 2022

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ