నేచురమ్ స్టార్ నాని.. ఇకపైనా నాని పేరులో నేచురమ్ స్టార్ అనేది ఉండదు.. ఉత్తి నాని తప్ప.. అంటూ నాని నే శ్యామ్ సింగా రాయ్ ప్రెస్ మీట్ లో చెప్పాడు. మరి నేచురల్ స్టార్ అని నాని తీసేసినా ప్రేక్షకులు కూడా ఆ పేరు ఉంచాలో లేదో.. శ్యామ్ సింగ రాయ్ మూవీతో తేల్చేస్తారు. కొన్నేళ్ళుగా నాని అనుకున్న హిట్ అయితే నానికి పడలేదు. వరసగా ప్లాప్స్ తోనే ఉన్నాడు. జెర్సీ హిట్ అన్నా కలెక్షన్స్ లేవు. సో అదీ ప్లాప్ కిందే లెక్క. ఇక గత ఏడాది వి, ఈ ఏడాది టక్ జగదీశ్ సినిమాల ప్లాప్ తో నిరాశలో ఉన్న నాని మార్కెట్ పడకుండా.. వెంటనే శ్యామ్ సింగ రాయ్ ని నాలుగు భాషల్లో దింపేస్తున్నాడు. ఈసారి ప్రమోషన్స్ తో సినిమాపై క్రేజ్ ప్రయత్నం చేసాడు నాని.
మరి నానికి శ్యామ్ సిగ్ రాయ్ హిట్ చాలా ముఖ్యం. ఇప్పుడు నాని ఫ్యూచర్ శ్యామ్ సింగ రాయ్ చేతుల్లోనే ఉంది. టాక్ లో తేడా కొడితే.. నాని కెరీర్ లో మాములుగా డ్యామేజ్ ఉండదు. నాలుగు భాషల్లో అంటూ హడావిడి చేసినంత సేపు ఉండదు.. నాని కెరీర్ కి డ్యామేజ్ అవ్వడం. మరి మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న శ్యామ్ సింగ రాయ్ పైనే నాని ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా కోసం అంచనాలకు మించి బడ్జెట్ పెట్టాం, అంచనాలకు మించి హిట్ అవుతుంది అని టీం నమ్ముతుంది. మరి నాని అలాగే టీం నమ్మకాన్ని ఆడియన్స్ ఏం చేస్తారో మరికొద్ది గంటల్లోనే తేలిపోతుంది.