Advertisementt

శ్యామ్ సింగ రాయ్ పబ్లిక్ టాక్

Fri 24th Dec 2021 10:14 AM
nani,shyam singha roy public review,nani shyam singha roy,shyam singha roy review,nani shyam singha roy telugu review  శ్యామ్ సింగ రాయ్ పబ్లిక్ టాక్
Shyam Singha Roy Public Talk శ్యామ్ సింగ రాయ్ పబ్లిక్ టాక్
Advertisement
Ads by CJ

హీరో నాని - టాలెంటెడ్ బ్యూటీ సాయి పల్లవి కలిసి రాహుల్ సంకీర్త్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన శ్యామ్ సింగ రాయ్ మూవీ ఈ రోజు డిసెంబర్ 24 న నాలుగు భాషల్లో రిలీజ్ అయ్యింది. క్రిష్టమస్ మనదే అంటూ నాని శ్యామ్ సింగ రాయ్ ప్రమోషన్స్ లో సినిమాపై అంచనాలు పెంచేశారు. ఈ సినిమా దేవదాసీ వ్యవస్థ నేపథ్యంలో తెరకెక్కినది. నాని ఈ సినిమాలో డ్యూయెల్ షేడ్స్ లో కనిపించారు. ఇక శ్యామ్ సింగ రాయ్ ఓవర్సీస్ ప్రీమియర్స్ ఇప్పటికే పూర్తి కాగా.. శ్యామ్ సింగ రాయ్ మూవీ పై సినిమా చూసిన ఆడియన్స్ పబ్లిక్ టాక్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు... మరి పబ్లిక్ శ్యామ్ సింగ రాయ్ పై ఎలాంటి రివ్యూ ఇస్తున్నారో చూసేద్దాం. 

శ్యామ్ సింగ రాయ్ లో నాని రెండు పాత్రల్లోనూ అదరగొట్టేసాడని, సినిమాకి నాని రోల్స్ రోల్ మేజర్ అసెట్ అంటున్నారు. ఇక సాయి పల్లవి పెరఫార్మెన్స్ పరంగా మరోసారి చెలరేగిపోయింది అని, నాని - సాయి పల్లవి లవ్ స్టోరీ ప్రేక్షకులని మెస్మరైజ్ చేస్తుంది అని టాక్. ఇంకా రాహుల్ సంకీర్త్యన్ దర్శకత్వ ప్రతిభ శ్యామ్ సింగ రాయ్ తో బయటపడిందని, ప్రతీ ఫ్రేమ్‌ను కూడా రాహుల్ చూపించిన తీరు, కథ నడిపించిన తీరు సూపర్బ్ అంటున్నారు. అయితే ఫస్ట్ హాఫ్ కాస్త సాగదీతగా అనిపించింది అని, సెకండ్ హాఫ్ బావుంది అంటున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్, సాంగ్స్, కొన్ని మాస్ సీన్స్, క్లైమాక్స్ ప్లస్ కాగా.. నేపధ్య సంగీతం మాత్రం సినిమాకి మెయిన్ హైలైట్ గా నిలిచింది అంటూ శ్యామ్ సిగ్ రాయ్ కి పబ్లిక్ రివ్యూస్ ఇస్తున్నారు.

Shyam Singha Roy Public Talk:

Nani Shyam Singha Roy Public Review

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ