బిగ్ బాస్ సీజన్ 5 లో షణ్ముఖ్ - సిరులు ఇద్దరూ టాప్ 5 వరకు చేరుకున్నారు. బోలెడంత క్రేజ్ ఉన్న షణ్ముఖ్ బిగ్ బాస్ కప్ గెలవాల్సిన వాడు కాస్తా సిరి వల్ల రన్నరయ్యాడు. అదే విషయం షణ్ముఖ్ ఒప్పుకున్నాడు కూడా. ఇక ముద్దులు, హగ్గులు విషయంలో సిరి తన తప్పేం లేదని చెబుతుంది. అయితే బిగ్ బాస్ హౌస్ లో సిరి - షణ్ముఖ్ లు మంచి ఫ్రెండ్స్ అని, అలాగే జెస్సి ఉంటే వారలా హద్దులు దాటి ప్రవర్తించేవారు కాదని మానస్ చెబుతున్నాడు. జెస్సి వెళ్లిపోవడంతో వారి మధ్యన ఎమోషనల్ బాండింగ్ ఏర్పడింది అని అంటున్నాడు. ఇక సిరి హౌస్ నుండి బయటికి వచ్చాక మేము మంచి ఫ్రెండ్స్, మా పర్సనల్ లైఫ్ లు మాకు తెలుసు.. మేమేమి తప్పు చెయ్యలేదు అని వాదిస్తుంది.
అయితే బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన సన్నీ చాలాసార్లు సిరికి చెప్పాలి అనుకున్నాడట. నీ కోసం బయట శ్రీహన్ ఉన్నాడు.. నువ్వు అలా చెయ్యొద్దు అని.. కానీ ఎన్నిసార్లు మట్లాడదామనుకున్నా.. ప్లీజ్ స్పేస్ కావాలంటూ నన్ను పంపేసేవారని, శ్రీహన్ చాలా మంచివాడని, శ్రీహన్ హీరో అవడానికి చాలా ట్రై చేస్తున్నాడని. అతను నాకు టాప్1 అవకాశం ఇచ్చాడు. షణ్ముఖ్, సిరిని దాటి నన్ను ఫస్ట్ ప్లేస్ లో పెట్టాడు.. నేను అప్పుడే ఫిదా అయ్యాను. తర్వాత సిరితో చెబుదామనుకున్నా.. నీ కోసం ఓ వ్యక్తి బయట ఉన్నాడు అని.. కానీ వాళ్ళు అవకాశం ఇవ్వలేదు అంటూ సన్నీ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అంటే హౌస్ లో వారి హగ్గులు, ముద్దులు వేరే కంటెస్టెంట్స్ కూడా తట్టుకోలేకపోయారనేది అర్ధమవుతుంది.