బాహుబలి తో నేషనల్ స్టార్ అయిన ప్రభాస్ కి విపరీతమయిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఏ ఇతర తెలుగు స్టార్స్ కి కూడా లేనంత క్రేజ్ కూడా ప్రభాస్ కి వుంది. అయితే ఇతర స్టార్స్ లా ప్రభాస్ అంత బాగా మాట్లాడలేరు.. ఏ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కానీ లేదా ఇతర పబ్లిక్ మీటింగ్స్ లో గానీ. ప్రభాస్ కి కొంచెం సింగ్ ఎక్కువ అందుకే అతను ఎక్కువగా మీడియా ముందుకు రావటానికి కూడా ఇష్ట పడరు. నిన్న హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో జరిగిన రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ప్రభాస్ అదే చెప్పారు. రాధేశ్యామ్ సినిమా ట్రైలర్ ఫాన్స్ చేత రిలీజ్ చేయించారు.
రామోజీ ఫిలిం సిటీ లో జరిగిడిన ఈ వేడుకకి కొన్ని వేలమంది ఫాన్స్ తరలివచ్చారు. ఈ సభలో ప్రభాస్ మాట్లాడుతూ తనకి సిగ్గు పోలేదని అందుకే ఎక్కువ మాట్లాడలేక పోయానని చెప్పారు. తన గత సినిమా సాహూ కి ఇండియా అంతా పర్యటించి చాలా ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేసానని, దానితో సిగ్గు పోయింది.. ఇక ఈ రాధే శ్యామ్ ఈవెంట్ లో ఎదో చించేద్దాం అనుకున్నా అని.. కానీ తనకి ఇంకా ఆ షై పోలేదని అందుకే ఏమి మాట్లాడలేక పోతున్నా అంటూ ప్రభాస్ ఫాన్స్ ని కాస్త నిరాశపరిచాడు అని చెప్పారు. ట్రైలర్ బాగుందా అని ఫాన్స్ ని అడిగి లవ్ యు డార్లింగ్స్ అని చివరగా చెప్పారు.