బిగ్ బాస్ సీజన్ 5 రన్నర్ గా నిలిచిన షణ్ముఖ్ జస్వంత్.. అసలైతే విన్నర్ అవ్వాల్సిన వాడు. కానీ సిరి ఫ్రెండ్ షిప్ వలన టైటిల్ కోల్పోయినట్లుగా షణ్ముఖ్ బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక చెప్పి అందరికి షాకిచ్చాడు. అసలు షణ్ముఖ్ బిగ్ బాస్ రన్నర్ గా కూడా అవ్వాల్సింది కాదు. అలా హౌస్ లో సిరి తో హగ్స్, ముద్దులతో ప్రేక్షకులకే చిరాకు తెప్పించాడు. ఆఖరికి షణ్ముఖ్ గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునయన కూడా షణ్ముఖ్ చేష్టలకి సోషల్ మీడియాలో షణ్ముఖ్ ని అన్ ఫాలో చేసింది. సిరి కూడా శ్రీహన్ తో ఎంగేజ్మెంట్ చేసుకుని హౌస్ లోకి అడుగుపెట్టి.. షణ్ముఖ్ తో అలాంటి చేష్టలు చెయ్యడంతో శ్రీహన్ కూడా హార్ట్ అయినట్లుగా కనిపించింది. ఇక దీప్తి సునయన కి షణ్ముఖ్ కి బ్రేకప్ అంటూ ప్రచారం కూడా జోరుగా జరుగుతుంది.
అయితే తాజాగా షణ్ముఖ్ ఆ ప్రచారం పై స్పందిస్తూ.. దీప్తి సునయన తనని సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసింది అని.. ఆ విషయమై హైదరాబాద్ కి వచ్చి దీప్తి తో మాట్లాడతాను అని, దీప్తి తో బ్రేకప్ అయ్యే ప్రసక్తే లేదని, దీపు నా వలన చాలా నెగెటివిటి ఫేస్ చేసింది అని, అయినప్పటికీ నాకోసం తాను స్టాండ్ తీసుకుంది అని, ఈ విషయమై తనతో మాట్లాడతాను అని, ఇక బ్రేకప్ అయితే జరగదు.. నా చేతి మీద దీపు పచ్చ బొట్టు ఉన్నంతవరకు తాను నా జీవితంలో ఉంటుంది.. ఆ పచ్చ బొట్టు పోయేంతవరకు దీపుని వదలను అంటూ చెప్పుకొచ్చాడు. మరి షణ్ముఖ్ మాటలపై దీప్తి సునయన రియాక్షన్ ఎలా ఉంటుందో అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.
.