నాని ఆవేదనకు గురవుతున్నాడని అంటున్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. ప్రస్తుతం ఏపీ లో టికెట్ ధరల ఇష్యు చాలా వివాదాస్పదంగా మారింది. టికెట్ ధరలను తగ్గించడమే కాకుండా.. థియేటర్స్ పై పడి.. థియేటర్స్ ని సీజ్ చేస్తూ టాలీవుడ్ ని ఏపీ ప్రభుత్వం అతలాకుతలం చేస్తుంది. దానితో కడుపు మండిన కొంతమంది హీరోలు నోరు విప్పుతున్నారు. పవన్ కళ్యాణ్, నాని లాంటివాళ్లు ఈ విషయమై తీవ్రంగా స్పందించారు. పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వ తీరుని ఎండగట్టారు. ఆ విషయంలో పవన్ కి ఇండస్ట్రీ సపోర్ట్ లేకపోయింది. రీసెంట్ గా నాని కూడా ఏపీ ప్రభుత్వం చేస్తున్న దారుణాలను మీడియా ముఖంగా మాట్లాడగా.. నానికి ఇండస్ట్రీ సపోర్ట్ చెయ్యలేదు. దానితో నాని కి మండి.. టాలీవుడ్ లో ఐక్యత లేకపోవడం వలనే ఏపీ ప్రభుత్వం ఇలాంటి దారుణానికి ఒడిగట్టింది అంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసాడు.
నాని మాట్లాడిన ప్రతి అక్షరం నిజం. కానీ ఇప్పటికి టాలీవుడ్ ఏకతాటిపైకి రాకపోగా.. నిర్మాత దిల్ రాజు.. నాని మాటలని తప్పుగా ఆర్షం చేసుకోవద్దు, నాని రెండు సినిమాలు ఓటిటిలో రిలీజ్ అయ్యి.. మూడో సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యేసరికి ఏపీలో అలాంటి పరిస్థితుల ఏర్పడడంతో నాని ఆవేదనకు గురవుతున్నాడు. తన సినిమా రిలీజ్ అవుతున్న టైం లో నాని చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని.. కరోనాతో తీవ్రంగా ఇబ్బంది పడిన తర్వాత రిలీజైన సినిమా నాని, తన కాంబినేషన్లో వచ్చిన వి సినిమా అని చెప్పిన ఆయన.. నాని మాటలని తప్పుగా అర్ధం చేసుకోవద్దని, నాని బాధలో ఉన్నాడని, ఆయన మనసులోకి వెళ్లి చూస్తే ఆ బాధ ఏమిటో అర్ధం అవుతుంది అని, నాని మాట్లాడింది ఒకటైతే.. జనాల్లోకి వెళ్ళింది మరొకటి అని దిల్ రాజు చెబుతున్నారు. అంటే నాని తప్పు మాట్లాడాడని దిల్ రాజు ఫీలింగా.. లేదంటే మారేదన్నానా.. అనేది మరో ప్రెస్ మీట్ లో దిల్ రాజు చెప్పబోతున్నాడు.