మెగా హీరో సాయి ధరమ్ తేజ్ వినాయక చవితి రోజున స్పోర్ట్స్ బైక్ పై స్పీడుగా వెళుతూ యాక్సిడెంట్ కి గురయ్యి దాదాపుగా నెల రోజులు పైనే హాస్పిటల్ ఉండి.. కోలుకుని ఇంటికి వచ్చాడు. ఓకల్ కార్డు ఆపరేషన్, భుజానికి ఆపరేషన్ తో సాయి ధరమ్ కోలుకోవడానికి చాలా రోజులు పట్టింది. అయితే ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్న సాయి ధరమ్ తేజ్.. పూర్తిగా కోలుకోవడంతో.. అతనిపై ఛార్జ్ షీట్ నమోదు చెయ్యడానికి సైబరాబాద్ పోలీస్ లు రెడీ అయ్యారు. సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం విషయంపై ప్రస్తుతం విచారణ జరుపుతున్నట్లు గా పోలీసులు చెప్పడమే కాదు.. ఈ కేసుపై త్వరలో చార్జిషీట్ కూడా దాఖలు చేస్తామని ప్రకటించారు.
సాయి తేజ్ కి యాక్సిడెంట్ అయిన తర్వాత పోలీస్ లు మట్లాడుతూ.. యాక్సిడెంట్ కేసులో సాయి ధరమ్ తేజ్‌కి నోటీసులు జారీ చేసినట్లు, పలు సెక్లన్ల కింద పోలీస్ లు కేసు ఫైల్ చేసినట్లుగా చెప్పారు. సాయి తేజ్ కోలుకున్న తర్వాత కచ్చితంగా అన్ని విషయాలు చర్చకు వస్తాయని అప్పట్లోనే పోలీస్ లు తెలిపారు. ప్రస్తుతం కోలుకున్న సాయి ధరమ్ కి నోటీసు లు పంపమని, త్వరలోనే సాయి తేజ్ ఈ నోటీసు లపై స్పందిస్తారని, ఇప్పటివరకు అయితే ఎలాంటి స్పందన లేదని పోలీస్ లు తెలిపారు.