Advertisementt

పుష్ప పై కరణ్‌ జోహార్‌ కామెంట్స్

Tue 28th Dec 2021 02:37 PM
allu arjun,megastar,karan johar,pushpa movie,north markets,bollywood king maker,karan,pushpa hindi collections  పుష్ప పై కరణ్‌ జోహార్‌ కామెంట్స్
Allu Arjun Is A Huge Megastar: Karan Johar పుష్ప పై కరణ్‌ జోహార్‌ కామెంట్స్
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప ది రైజ్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఇంకా నాలుగు భాషల్లో సత్తా చాటుతుంది. హిందీలో మెల్లిగా ఓపెనింగ్స్ మొదలు పెట్టిన పుష్ప.. తర్వాత అక్కడ స్టడీ కలెక్షన్స్ కొల్లగొడుతుంది. తాజాగా బాలీవుడ్ కింగ్ మేకర్ కరణ జోహార్ పుష్ప మూవీ పై స్పందిస్తూ..  తెలుగు సినిమాల ఓపెనింగ్‌ కలెక్షన్లను హిందీ సినిమాలు కూడా అందుకోలేకపోతున్నాయని.. అందుకు అల్లు అర్జున్‌ నటించిన పుష్ప సినిమానే ఉదాహరణగా చూపించారు. బాలీవుడ్‌లో ఈ చిత్రంతో.. బన్నీకి మరింత క్రేజ్‌ పెరిగింది. ఇప్పటికే పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు సినిమాపై, బన్నీపై ప్రశంసలు కురిపించగా.. తాజాగా కరణ్‌ జోహార్‌ పుష్ప సినిమా ని ఓ రేంజ్ లో పొగిడేశారు.

అల్లు అర్జున్ స్టార్‌డమ్‌తోనే హిందీ పుష్పకి భారీ ఓపెనింగ్స్‌ వచ్చాయని అన్నారు. బన్నీకి బాలీవుడ్‌లో ఆ స్టార్‌డమ్‌ రావడానికి గల కారణాన్ని కూడా కరణ్‌ వివరించారు. ఓటీటీ, ఇతర మాధ్యమాల ద్వారా తెలుగు సినిమాలు హిందీలో అనువాదమవుతున్నాయి. దీంతో ఆయా నటులకు హిందీలో ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్‌ సినిమాలు హిందీలో దుబ్ అయ్యి అలా ఆయనకి బాలీవుడ్‌లో క్రేజ్‌ పెరిగింది. దాన్ని ఎవరూ ఆపలేరు. అందుకే, హిందీలో విడుదలైన పుష్పకి కూడా భారీ ఓపెనింగ్‌ కలెక్షన్లు వచ్చాయి. హిందీ సినిమాలు కూడా అంత కలెక్షన్స్‌ రాబట్టలేకపోయాయి అని కరణ్‌ జోహార్‌ తెలిపారు.

Allu Arjun Is A Huge Megastar: Karan Johar:

Allu Arjun Is A Huge Megastar, Karan Johar Heaps Praises On Pushpa Star And Success In North Markets 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ