తెలుగు సినిమాల్లో సక్సెస్ కాక బాలీవుడ్ కి వెళ్లి అక్కడ తన క్రేజ్ ఏమిటో.. తన సత్తా ఏమిటో చూపించి.. టాప్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తున్న కియారా అద్వానీ.. స్కిన్ షో కి బాలీవుడ్ మొత్తం ఫిదానే. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా వుండే కియారా అద్వానీ.. ప్రస్తుతం సౌత్ లో రామ్ చరణ్ తో కలిసి టాప్ కోలీవుడ్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మూడు భాషల్లో తెరకెక్కుతున్న RC15 లో నటిస్తుంది. రామ్ చరణ్ తో రెండోసారి నటిస్తున్న కియారా కి బాలీవుడ్ లో బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. కానీ ఆ విషయాన్ని కియారా బయటపెట్టదు. కియారా బాయ్ ఫ్రెండ్ ఎవరో కాదు.. సిద్దార్థ్ మల్హోత్రా. ఆయనా బాలీవుడ్ హీరోనే.
ఇప్పటివరకు విడివిడిగా వెకేషన్స్ కి వెళ్లే ఈ జంట తాజాగా కలిసి వెకేషన్స్ ని ఎంజాయ్ చెయ్యబోతున్నారు. కియారా అద్వానీ - సిద్దార్థ్ మల్హోత్రా కలిసి న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం విదేశీ ట్రిప్ వేశారు. కియారా తో కలిసి కియారా అద్వానీ ఈ రోజు మంగళ వారం ఉదయం ముంబై ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చింది. దానితో వీరిద్దరూ లవర్స్ అనే విషయాన్ని అఫీషియల్ గా ఒప్పేసుకున్నారు. గతంలో విడిగా వెకేషన్స్ కి వెళ్లినట్టుగా ఎయిర్ పోర్ట్ లో బిల్డప్ ఇచ్చిన కియారా, సిద్దార్థ్ లు ఈ రోజు రెడ్ హ్యాండెడ్ గా మీడియాకి దొరికిపోయారు. మరి కియారా అద్వానీ - సిద్ధార్ట్ లు న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ఎక్కడ సెలెబ్రేట్ చేసుకోబోతున్నారో అనేది వారు సోషల్ మీడియాలో కన్ ఫామ్ చేసేవరకు సస్పెన్స్.