మహానటి మాయ, క్రేజ్ నుండి ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్న కీర్తి సురేష్ స్లిమ్ గా గ్లామర్ గా తయారైంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా వుండే కీర్తి సురేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట షూటింగ్ లో బిజీగా వుంది. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కి పెద్దన్నలో చెల్లి గా నటించిన కీర్తి సురేష్.. టాలీవుడ్ మెగాస్టార్ కి సిస్టర్ గా భోళా శంకర్ లోను నటిస్తుంది. ఇక కీర్త్ సురేష్ మహేష్ బాబు సరసన మోడరన్ గా సర్కారు వారి పాటలో కనిపించబోతుంది. సోషల్ మీడియాలో తన క్యూట్ కుక్కపిల్లలతో ఫొటోలకి ఫోజులిచ్చే కీర్తి సురేష్.. తాజాగా షేర్ చేసిన పిక్ లో చాలా స్టైలిష్ గా మోడరన్ గా కనిపిస్తుంది.
ఎప్పుడూ చీరలు, చుడి దార్స్ లో కనిపించే కీర్తి సురేష్ ఇలా మోడరన్ డ్రెస్ లో కనిపించే సరికి ఆమె ఫాన్స్ ఫిదా అవుతున్నారు. ఆ పిక్ తో పాటుగా కీర్తి సురేష్ Midweek monochrome. ✨అంటూ షేర్ చేసింది. ప్రస్తుతం కీర్తి సురేష్ మోడరన్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కీర్తి సురేష్ నటించిన విమెన్ సెంట్రిక్ మూవీ గుడ్ లక్ సఖి విడుదలకి రెడీగా ఉంది. అలాగే తమిళంలోనూ బిజీ తారగా మారింది.