కరోనా సెకండ్ వేవ్ తో చాలా సినిమాలు రిలీజ్ పోస్ట్ పోన్ అవడం.. తర్వాత మళ్ళీ థియేటర్స్ ఓపెన్ అయ్యి, షూటింగ్స్ సజావుగా సాగడంతో.. వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో భారీ బడ్జెట్ మూవీస్ కూడా రిలీజ్ అవ్వడం చూస్తున్నాం. అఖండ, పుష్ప, శ్యామ్ సింగ రాయ్ ఈ నెలలో పెద్ద సినిమాలుగా ప్రేక్షకుల ముందుకు రాగా.. వచ్చే నెల జనవరిలో పాన్ ఇండియా మూవీస్ గా ఆర్.ఆర్.ఆర్, రాధేశ్యామ్ మూవీస్ రాబోతున్నాయి. ఇక ఫిబ్రవరిలో క్రేజి మూవీస్ అందులోనూ మెగా హీరోల మూవీస్ రాబోతున్నాయి. చిరంజీవి - రామ్ చరణ్ కలయికలో కొరటాల తెరకెక్కించిన ఆచార్య మూవీ ఫిబ్రవరి 4 న రిలీజ్ కాబోతుంది. భారీ అంచనాలతో తెరకెక్కిన ఆచార్య మూవీ క్రేజీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక అదే నెలలో సంక్రాంతి నుండి డేట్ మార్చుకుని 25 న పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ కాబోతుంది.
సంక్రాంతికి విడుదల కావల్సిన భీమ్లా నాయక్ ఆర్.ఆర్.ఆర్, రాధేశ్యామ్ మూవీస్ కోసం త్యాగం చేసి ఫిబ్రవరికి షిఫ్ట్ అయ్యింది. అదే ఫిబ్రవరిలో ఆచార్య - భీమ్లా నాయక్ మూవీ మధ్యన క్రాక్ తో సూపర్ హిట్ కొట్టిన రవితేజ ఖిలాడీ మూవీ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈమధ్యనే హైదరాబాద్ లో సాంగ్స్ షూట్ చిత్రీకరణలో బిజీగా వున్న రవితేజ - రమేష్ వర్మల ఖిలాడీ మూవీ ఫిబ్రవరి 11 న రిలీజ్ కాబోతుంది. మెగా హీరోల మధ్యలో రవితేజ ఖిలాడీ తో రాబోతున్నాడు. రాక్షసుడు తో హిట్ కొట్టిన రమేష్ వర్మ తో క్రాక్ తో సూపర్ హిట్ కొట్టిన రవితేజ చేస్తున్న ఖిలాడీ పై మంచి అంచనాలున్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఖిలాడీ సినిమా చిరు - పవన్ మధ్యలో క్రేజీగా విడుదల కాబోతుంది.