Advertisementt

విజయ్ దేవరకొండకి అలియా కావాలంట

Thu 30th Dec 2021 09:14 PM
vijay deverakonda,alia bhatt,shiva nirvana,liger movie,puri jaganandh,vijay pan india star  విజయ్ దేవరకొండకి అలియా కావాలంట
Vijay Devarakonda wants Alia Bhatt విజయ్ దేవరకొండకి అలియా కావాలంట
Advertisement
Ads by CJ

విజయ్ దేవరకొండ ఇప్పుడు పెద్ద స్టార్ అయ్యాడు. ఒక్క తెలుగులోనే కాదు, మొత్తం దేశం అంతా విజయ్ పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ దర్శకత్వం లో లైగర్ అనే చిత్రం చేస్తున్నాడు. ఇది పాన్ ఇండియన్ సినిమాగా వచ్చే ఏడాది ఆగష్టు లో విడుదల కాబోతుంది. ఇందులో అనన్య పాండే హీరోయిన్, బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఒక ముఖ్య పాత్ర వేస్తున్నారు. ఇదిలా ఉంటే, విజయ్ దేవరకోండ తన తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియన్ గా రిలీజ్ అవ్వాలి అంటున్నాడట. 

అందుకోసం తన తదుపరి కథల్లో చిన్న చిన్న మార్పులు చెయ్యడమే కాకుండా, ఆ సినిమాల కోసం కొంతమంది బాలీవుడ్ యాక్టర్స్ ని కూడా తీసుకోమని చెబుతున్నాడట. లైగర్ తరువాత విజయ్ శివ నిర్వాణ దర్శకత్వం లో ఒక సినిమా చేయాల్సి వుంది. అయితే ఈ సినిమాకి హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ని అడగండి అని మేకర్స్ కి చెప్పేస్తున్నాడట. ఒకవేళఅలియా భట్ లేకపోతే, కియారా అద్వానీ అయినా ఉండాలి అన్నాడట. ఇప్పుడు విజయ్ దేవరకొండ కోసం మేకర్స్ ఆ పని మీద ఉన్నారని వినికిడి. 

Vijay Devarakonda wants Alia Bhatt:

Vijay Deverakonda To Romance Alia Bhatt

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ