ఏదైనా మంచి మాట పది మంది చెవులో చెప్పమన్నారు, అదే చేడు మాట అయితే, సైలెంట్ గా ఉండాలి అంటారు. కానీ మెగా ఫ్యామిలీని బ్యాడ్ చేయాలనుకుంటున్న వ్యక్తి మాత్రం పని కట్టుకొని, అందరికి ఫోన్ చేసి మరీ మెగా ఫ్యామిలీ గురించి నెగటివ్ వార్తలు చెప్తున్నాడు. ఈ నెగటివిటీ చెప్తున్న వ్యక్తి కూడా ఒకప్పుడు మెగా ఫ్యామిలీ కి చెందిన వాడే. అయితే తన క్యారెక్టర్ ని సరిగ్గా కాపాడుకోలేక, ఆ ఫ్యామిలీ నుంచి బయటకి వచ్చాడు, కాదు గెంటివేయ బడ్డాడు అనుకోండి. బయటకి వచ్చాక, తన పని ఏదో తాను చూసుకోవచ్చు కదా.
కానీ అలా చెయ్యకుండా, మెగా ఫ్యామిలీ లో ఎప్పుడు ఏమి జరుగుతుందా? ఎప్పుడు ఏ న్యూస్ దొరుకుతుందా? అని ఆ మెగా కుటుంబం వైపు ఒక కన్నేసి ఉంచుతాడు. అయితే శుభవార్తలు కోసం కాదండోయ్, కేవలం నెగటివ్ వార్తల కోసం. ఇప్పుడు కూడా సదరు వ్యక్తి అందరికి ఫోన్ చేసి ఏమి చెపుతున్నాడంటే, మెగా కుటుంబంలో ఒక జంట విడిపోతోందని.. దానిలో అతనికేంటి లాభం అనుకుంటున్నారా. వాళ్ళు విడిపోతే ఈయనకి పైశాచికానందం అన్నమాట. ఎందుకంటే ఆయన్ని మెగా ఫ్యామిలీ బయటికి పంపేసింది కాబట్టి.