Advertisementt

మహేష్ ని వదలవా వంశీ

Fri 31st Dec 2021 11:19 AM
mahesh babu,vamsi paidipally,mahesh and vamsi families,dubai vacation,namratha,sitara,gautham,adya  మహేష్ ని వదలవా వంశీ
Mahesh Babu family Dubai vacation moments మహేష్ ని వదలవా వంశీ
Advertisement
Ads by CJ

మహేష్ బాబు దర్శకుడు వంశీ పైడిపల్లి మహర్షి మూవీ నుండి ట్రావెల్ చేస్తున్నారు. మహర్షి మూవీ హిట్ తర్వాత మళ్లీ మహేష్ తోనే సినిమా చేద్దామనుకున్న వంశీ కి మహేష్ పడలేదు.. దానితో వంశి పైడిపల్లి తమిళ విజయ్ కి కథ చెప్పి ఒప్పించి దిల్ రాజు తో కలిసి పాన్ ఇండియా మూవీకి శ్రీకారం చుట్టిన వంశీ మాత్రం సూపర్ స్టార్ ఫ్యామిలీని వదల్లేదు. మహేష్ బాబు ఫ్యామిలీ తో వంశీ ఫ్యామిలీ ఎప్పటికప్పుడు మింగిల్ అవుతుంది. మహేష్ కూతురు సితార - వంశీ కూతురు ఆద్య లు కలిసి యూట్యూబ్ ఛానల్ నడపడం, మహేష్ వైఫ్ నమ్రతతో వంశీ వైఫ్ కలిసి పోవడం, పార్టీలు, బర్త్ డే ఫంక్షన్స్ అంటూ రెండు ఫామిలీస్ కలిసి ఎంజాయ్ చేసిన సందర్భాలు కోకొల్లలు. ఇక తాజాగా మహేష్ బాబు ఫ్యామిలీ దుబాయ్ లో ఉంది. మహేష్ మోకాలి ఆపరేషన్ తర్వాత దుబాయిలో రెస్ట్ తీసుకోవడంతో.. మహేష్ ఫ్యామిలీ న్యూ ఇయర్, క్రిష్టమస్ సెలెబ్రేషన్స్ ని అక్కడే జరుపుకుంటున్నారు.

అయితే న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం, అలాగే వంశీ కూతురు ఆద్య బర్త్ డే వేడుకల కోసం వంశీ కూడా దుబాయ్ ఫ్యామిలీతో కలిసి వెళ్లారు. అక్కడ సూపర్ స్టార్ ఫ్యామిలీ తో కలిసి దుబాయ్ లోని బూర్జ ఖలీఫాలో ఫామిలీస్ తో కలిసి ఎంజాయ్ చేసిన ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసారు. మహేష్ అలాగే సితార, గౌతమ్, నమ్రత అలాగే వంశీ ఆయన వైఫ్, కూతురు ఆద్యలతో బూర్జ ఖలీఫా పై ఉన్న ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో.. నెటిజెన్స్ ఏంటి వంశీ మహెష్ ని ఆయన ఫ్యామిలీని వదలవా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Mahesh Babu family Dubai vacation moments:

Mahesh Babu and Vamsi Paidipally families Dubai vacation moments

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ