బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ ఆయన గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునయన అఫీషియల్ గా విడిపోయారు. అందరూ 2022 ని ఎన్నో ఆశలతో, ఎంతో ఉత్సాహంగా స్వాగతం పలికితే.. షణ్ముఖ్ గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునయన మాత్రం 2021 ఎండ్ కి షాకిస్తూ.. 2022 కి బ్రేకప్ తో ఆహ్వానం పలికింది. తాను షణ్ముఖ్ విడిపోతున్నట్టుగా సోషల్ మీడియా ద్వారా కంఫర్మ్ చేసింది. బిగ్ బాస్ వలన షణ్ముఖ్ - దీప్తి విడిపోయారని అని ప్రచారం జరుగుతున్న టైం లోనే షణ్ముఖ్ దీప్తి సునయనని వదిలే ప్రశక్తే లేదు అంటూ ఫాన్స్ చిట్ చాట్ లో చెప్పాడు. కానీ దీప్తి సునయన ఫాన్స్ కి హింట్స్ ఇస్తూ.. ఎప్పటి నుండో చెప్పడానికి ట్రై చేస్తుంది. ఇక తాము విడిపోతున్నామనే విషయాన్ని డిసెంబర్ 31 రాత్రి సోషల్ మీడియా ద్వారా చెప్పి షాకిచ్చింది.
షణ్ముఖ్ తాను పరస్పరం చర్చించుకుని, ఇద్దరం కలిసి నిర్ణయించుకుని విడిపోయామని, ఎవరి దారిలో వారు ప్రయాణం చెయ్యాలని అనుకుంటున్నామని, ఈ నిర్ణయం కష్టమైనా తప్పడం లేదు అని.. సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్నీ తెలియజేస్తున్నామని, ఫాన్స్ తమని అర్ధం చేసుకోవాలంటూ పోస్ట్ చెయ్యడంతో.. అందరూ అనుకున్నదే, ఊహించిందే జరిగింది అని అంటున్నారు. అయితే ఈ విషయమై షణ్ముఖ్ ఇంతవరకు రియాక్ట్ కాలేదు. దీపుని వదలను, ఈపచ్చబొట్టు ఉన్నంతవరకు దీపు నాతో ఉంటుంది అని కాన్ఫిడెంట్ తో చెప్పిన షణ్ముఖ్ ఇప్పుడు ఈ విషయంలో ఎలా స్పందిస్తాడో అనేది ఆసక్తిగా మారింది.
అయితే షణ్ముఖ్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ చెబుతూ పోస్ట్ లు పెడుతున్నాడు కానీ.. దీప్తి సునయన విషయం, తనకు బ్రేకప్ అయిన విషయం మాత్రం మాట్లాడడం లేదు.