జూనియర్ ఎన్ టి ఆర్ బావమరిది నార్నె నితిన్ తెలుగు సినిమాలో హీరోగా ఆరంగేట్రం చేయనున్న సంగతి తెలిసిందే. అయితే అతని తండ్రి జూనియర్ ఎన్ టి ఆర్ మామ అయిన నార్నె శ్రీనివాసరా రావు మాత్రం పెద్ద ఎత్తున కొడుకు కెరీర్ ఆరంభించాలని చూస్తున్నారు. రియల్ ఎస్టేట్ అధినేత అయిన తాను తన కుమారుని కోసం సుమారు ముప్పయి కోట్లు పెడుతున్నట్టు తెలుస్తుంది. ఒక్క మొదటి సినిమాకె ఇలా కాకుండా, వరుసగా నాలుగు సినిమాల చేసేటట్టు చూసుకుంటున్నారు. ఇప్పటికే దర్శకులని కూడా ఈ నాలుగు సినిమాలకు ఖరారు చేసుకున్నట్టు సమాచారం.
నితిన్ డెబ్యూ సినిమాకి సతీష్ వేగ్నేశ దర్శకత్వం చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది. అలాగే రెండో సినిమాకు పిల్ల జమీందార్ మరియు భాగమతి సినిమాలకు దర్శకత్వం వహించిన అశోక్ చేయనున్నారు. ఇలా మొదటి రెండు సినిమాలకు నార్నె నితిన్ అన్నీ సిద్ధం చేసుకొని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో అడుగుపెడుతున్నారు. నితిన్ కి ఎలాగు తన బావ జూనియర్ ఎన్ టి ఆర్ సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే స్వంత బావమరిది సినిమాలు కదా అందుకే జూనియర్ ఎన్ టి ఆర్ ప్రమోట్ చెయ్యడానికి సిద్ధం. అలాగే ఈ ఇద్దరు దర్శకులు కథలను ముందు జూనియర్ ఎన్ టి ఆర్ కి వినిపించారు కూడా. ఎన్ టి ఆర్ ఓకె చేసాక ఆ కథలని ఫైనలైజ్ చేసారు.