రాజమౌళి మల్టీ స్టార్ సినిమా ఆర్.ఆర్.ఆర్ ఎప్పుడయితే రిలీజ్ పోస్టుపోన్ చేసుకుందని తెలిసిందో, చాలా చిన్న సినిమాలు సంక్రాంతి పండగ నాడు విడుదల కి రెడీ అయిపోతున్నాయి. దిల్ రాజు అన్న కొడుకు ఆశిష్ డెబ్యూ సినిమా రౌడీ బాయ్స్, మరో డెబ్యూ సినిమా, గల్లా జయదేవ్ కొడుకు డెబ్యూ అశోక్ సినిమా హీరో, ఆది సాయికుమార్ సినిమా అతిధి దేవోభవ, ఇంకో చిన్న సినిమా గ్యాంగ్ స్టర్ గంగరాజు, ఇంకా మరికొన్ని చిన్న సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇక పాన్ ఇండియా ఫిలిం ప్రభాస్ రాధే శ్యామ్ కూడా రిలీజ్ అవుతుందో.. లేదో.. తెలీదు. ఎందుకంటే ఆ నిర్మాతలు మాత్రం ఇప్పటికి సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చేస్తాం అంటున్నారు.
అప్పటికి ఇండియా వైడ్ గా పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. అందుకే ఈ చిన్న సినిమాలు అన్నీ తమ రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసేసారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నాగార్జున ముందే ప్రకటించినట్టుగా తన బంగార్రాజు ని సంక్రాంతికి రెడీ చేసేసారు. నాగార్జునకి అసలు పోటీ లేకుండా పోయింది. ఎందుకంటే ఈ చిన్న సినిమాలు ఏవీ నాగార్జున కి పోటీ కావు. అందుకే నాగార్జున లక్కీ.. పోటీ లేకుండా సంక్రాంతి బరిలో నిలవబోతున్నారని ఇండస్ట్రీలో అందరు అనుకుంటున్నారు. ఇక బంగార్రాజు రిలీజ్ డేట్ కూడా రేపో మాపో రాబోతుంది.