సిద్ధూ జొన్నలగడ్డ సినిమా సినిమాకి కొంచెం క్రేజ్ పెంచుకుంటూ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యాక్టర్స్ లో ఒకడు. సిద్ధూ నటించితిన్ రీసెంట్ సినిమా డి జె టిల్లు ఇప్పుడు సంక్రాంతి బరిలో వుంది. దీనికి విమల్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే విశ్వసనీయ సమాచారం ఏంటంటే ఈ సినిమా ఇంకా రెండు రోజుల షూట్ బ్యాలెన్స్ ఉందిట. అది ఈ వీక్ లో ప్లాన్ చేసి కంప్లీట్ చేస్తారట. సిద్ధూ సినిమాలు అన్నిటికి సిద్ధూ నే బాగా ఇన్వాల్వ్ అవుతాడు. దర్శకుడు ఎవరు అయినా కూడా సిద్ధూ తన వేలు అన్నిటిలో పెడతాడు.
డి జె టిల్లు సినిమాలో పని చేసిన ఎవరిని అయినా మీ సినిమా దర్శకుడు ఎవరని అడిగితే, ఇది సిద్ధూ సినిమా, అన్ని సిద్ధునే కదా చూసుకుంటాడు అని సమాధానం చెప్తారు. అంటే అక్కడ దర్శకుడు నామ మాత్రం, సిద్ధూ నే అన్నీ. నేహా శెట్టి ఇందులో కథా నాయికగా నటిస్తుంది. సితార ఎంటర్ టైన్ మెంట్ వాళ్ళు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇంకో యాక్టర్ ప్రిన్స్ ఇందులో ముఖ్య పాత్ర లో కనిపిస్తుండగా, క్యారెక్టర్ నటుడు బ్రహ్మాజీ కూడా ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నారని తెలిసింది. శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూరుస్తున్నారు.