బాలీవుడ్ లో కెరీర్ మొదలు పెట్టినప్పటినుండే సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతున్న సైఫ్ అలీ ఖాన్ వారసురాలు సారా అలీ ఖాన్.. ఇప్పుడు స్టార్ హీరోల పాలిట మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. కత్తిలాంటి గ్లామర్ ని ఒలకబోస్తూ.. జిమ్ వెర్, బికినీ షోస్ అంటూ హంగామా చేసే ఈ హీరోయిన్ తాను పెళ్లి చేసుకోబోయేవాడికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో చెప్పింది. ఆమె నటించిన అత్రాంగి రే సినిమా సక్సెస్ సెలెబ్రేషన్స్ లో సారా అలీ ఖాన్ తనకి కాబోయే భర్త పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన భర్త ఎలా ఉండాలి, ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో చెప్పి అందరికి షాకిచ్చింది.
అది తనకి కాబోయే భర్త ఇల్లరికం ఉండాలనే కండిషన్ పెట్టింది సారా అలీ ఖాన్. ఎందుకంటే నాకు అమ్మే సర్వస్వము అంటుంది. తన తల్లితో ఉంటే హ్యాపీ గా ఉంటాను అని, ఆమె తనకు ఓ ఇల్లులాంటిది అని చెబుతుంది. షూటింగ్స్ కోసమైనా, ఇంకా వేరే పని కోసం ఎక్కడికి వెళ్లినా చివరికి ఎలా ఇంటికి చేరుతామో.. అలాగే ఎంత బిజీగా వున్నా నేను అమ్మతో గడపడానికే ఇష్టపడతాను. ఇప్పటికీ నాకు డెస్సింగ్ స్టయిల్ తెలియదు. బయటికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలో అమ్మే చెబుతుంది. ఎలాటి డ్రెస్ వేసుకోవాలో కూడా మా అమ్మే చెబుతుంది. నేను ఓన్ గా ఎలాంటి నిర్ణయం తీసుకోలేను.. అందుకే అమ్మని వదిలి ఎక్కడికీ పోలేను. కాబట్టి నన్ను పెళ్లి చేసుకునేవాడు ఇల్లరికం రావడానికి ఒప్పుకోవాలి.. అలా అయితేనే పెళ్లి అంటూ చెప్పుకొచ్చింది.