Advertisementt

డిప్రెషన్ లో స్టార్ హీరోస్

Tue 04th Jan 2022 03:17 PM
ntr,ram charan,rrr movie,rajamouli,rrr postponed,danayya,dvv danayya  డిప్రెషన్ లో స్టార్ హీరోస్
Star Heroes in Depression డిప్రెషన్ లో స్టార్ హీరోస్
Advertisement
Ads by CJ

అనుకున్న టైం కి పని జరిగితే.. ఫలితం గుడ్ అయినా, బాడ్ అయినా.. అందరూ హ్యాపీ నే. కానీ అనుకున్న పని అనుకోకుండా పోస్ట్ పోన్ అయితే చిరాకు, కోపం వస్తాయి. మరి ఎంతో కష్టపడి నోటి వరకు వచ్చిన అన్నాన్ని లాగేసుకుంటే.. అది ఎంత బాధగా ఉంటుంది అనేది ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ హీరోలు అనుభవిస్తున్నారు. సినిమాలో నటించడానికి కండలు పెంచి.. రాత్రి పగలు, ఎండా, చలి లో ఎంతో శ్రమటోర్చి, ఆఖరికి ప్రమోషన్స్ కోసం ఫ్యామిలీని వదులుకుని ఊరూరా తిరుగుతూ ఇబ్బందులు పడ్డారు. ఎక్కే ఫ్లైట్ ఎక్కడం దిగే ఫైట్ దిగడం. ఇదేమి మాములు విషయం కాదు. అయినా ఉత్సాహంతో.. ప్రేక్షకుల మీద భారం వేసిన ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ లకి కరోనా బాగా దెబ్బేసేసింది. లాస్ట్ మినిట్ లో సినిమాని పోస్ట్ పోన్ చెయ్యాల్సి వచ్చింది.

అన్నీ అనుకున్నాక సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అనేది ఆ హీరోల మీద ఎంతో ఒత్తిడి పెంచుతుంది. అదంతా ఒక ఎత్తు.. పాన్ ఇండియాలోకి ఫస్ట్ టైం అడుగుపెడుతున్న హీరోలు.. ఆ సినిమా అనుకోకుండా పోస్ట్ పోన్ అయితే ఆ బాధ మాములుగా ఉండదు. ఇప్పుడు ఆ పెయిన్ ని ఎన్టీఆర్, రామ్ చరణ్ అనుభవిస్తున్నారట. తీవ్ర ఒత్తిడిలో డిప్రెషన్ లో ఎన్టీఆర్ అండ్ చరణ్ లు ఉన్నట్లుగా మీడియాలో వార్తలొస్తున్నాయి. మళ్ళీ సినిమా రిలీజ్ డేట్ ఇచ్చాక ఇంత ప్రమోషన్స్ చేసినా ఫలితం ఉంటుందా.. ఇప్పుడున్న క్రేజ్ ఆర్.ఆర్.ఆర్ కి మళ్ళీ వస్తుందా అని ఫీలవుతున్నారట. మరి ఈ ఇద్దరు హీరోలు.. ఏదైనా పబ్లిక్ ఈవెంట్స్ కి కానీ.. లేదంటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తే.. ఒత్తిడిని తట్టుకోవచ్చని ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఫాన్స్ హీరోలకి సలహాలు ఇస్తున్నారు.

Star Heroes in Depression:

NTR and Ram Charan in Depression?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ