Advertisementt

స్పిరిట్ లో ప్రభాస్ రోల్ రివీల్డ్

Wed 05th Jan 2022 07:25 AM
prabhas,bhushan kumar,prabhas role,spirit,sundeep vanga,arjun reddy fame,prabhas radhe shyam,salaar movie,aadipurush,nag ashwin project k  స్పిరిట్ లో ప్రభాస్ రోల్ రివీల్డ్
Prabhas Role Revealed In Spirit Movie స్పిరిట్ లో ప్రభాస్ రోల్ రివీల్డ్
Advertisement
Ads by CJ

ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ రిలీజ్ హడావిడిలో ఉన్నారు. రాధే శ్యామ్ రిలీజ్ అవుతుందో లేదో అనే కన్ఫ్యూజన్ లో ఫాన్స్ ఉన్నారు. పాన్ ఇండియా మూవీ కాబట్టి రిలీజ్ వాయిదా పడొచ్చనే ఊహాగానాలు నడుస్తున్నాయి. ఇక రాధే శ్యామ్ తరవాత ప్రభాస్ సలార్ మరియు నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ షూటింగ్ లు చేసుకుంటారు. ఇప్పటికే ప్రాజెక్ట్ కె ఫస్ట్ షెడ్యూల్, సలార్ రెండు షెడ్యూల్స్ పూర్తి అయ్యాయి. ఇక ఈ రెండు సినిమాల షూటింగ్స్ కొలిక్కి రాగానే.. తన తదుపరి పాన్ ఇండియా ఫిలిం స్పిరిట్ షూట్ కి జాయిన్ అవుతారు. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా అనూహ్యంగా ప్రభాస్ తో స్పిరిట్ మూవీని ప్రకటించి సర్ ప్రయిజ్ చేసిన విషయం తెలిసిందే. 

అయితే ఇప్పుడు తాజాగా స్పిరిట్ అప్ డేట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అదేమిటంటే ప్రభాస్ తన కెరీర్ లోనే ఫస్ట్ టైం ఓ పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా స్పిరిట్ మూవీలో కనిపించబోతున్నారనే విషయాన్ని స్పిరిట్ ని నిర్మిస్తున్న నిర్మాత భూషణ్ కుమార్ రివీల్ చేసారు. అయన స్పిరిట్ అప్ డేట్ ఇవ్వగానే పాన్ ఇండియా మార్కెట్ లో అద్భుతమైన ఫాలోంగ్ ఉన్న ప్రభాస్ మాస్ కటౌట్ ని పోలీస్ అధికారిగా ఊహించుకుంటూ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. ప్రభాస్‌ 25వ సినిమాగా, పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న స్పిరిట్ మూవీని భూషణ్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా కరీనా కపూర్ పేరు గట్టిగా వినిపిస్తుంది.

 

Prabhas Role Revealed In Spirit Movie:

 Bhushan Kumar talks about Prabhas role in Spirit

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ