Advertisementt

దీప్తి సునయన కన్నీళ్లు - షణ్ముఖ్ ఎంజాయ్మెంట్

Wed 05th Jan 2022 10:47 AM
shanmukh jaswanth,siri,deepthi sunaina,siri birthday party,siri birthday,jesseei  దీప్తి సునయన కన్నీళ్లు - షణ్ముఖ్ ఎంజాయ్మెంట్
Deepthi Sunaina Tears - Shanmukh Enjoyment దీప్తి సునయన కన్నీళ్లు - షణ్ముఖ్ ఎంజాయ్మెంట్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ ఎవరికీ ఏమిచ్చిందో.. ఎంతమందికి ఆఫర్స్ తెచ్చిందో కానీ.. ప్రేమ జంటలను విడగొట్టేసింది. అది బిగ్ బాస్ తప్పుకాదు.. అందులో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ తప్పు. హద్దుల్లో ఉండాల్సిన వారు లిమిట్స్ క్రాస్ చేస్తే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పినట్టుగా షణ్ముఖ్ ప్రియురాలిని కోల్పోయాడు. షణ్ముఖ్ గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునయన షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పేసి.. ఒంటరిదైంది. నిన్నటివరకు కెరీర్ పోగొట్టుకుని షణ్ముఖ్ తో చెట్టాపట్టాలేసుకుని తిరిగాను, ఇకపై కెరీర్ పై దృష్టి పెడతాను అంటూ దీప్తి సునయన కన్నీళ్లు పెట్టుకుంటూ బాధలో మునిగిపోయింది.

మరోపక్క ఆమె జీవితం ఆమె ఇష్టం.. తన నిర్ణయాన్ని గౌరవిద్దాం అంటూ చెప్పిన షణ్ముఖ్.. ఇప్పుడు ఎవరి కోసమైతే తనకి బ్రేకప్ జరిగిందో వాళ్ళ బర్త్ డే పార్టీలో పాల్గొని ఎంజాయ్ చేశాడంటూ సోషల్ మీడియాలో గుప్పుమంది. బిగ్ బాస్ హౌస్ లో సిరి తో అతి ఫ్రెండ్ షిప్ చేసి.. పర్సనల్ లైఫ్ లో సమస్యల్లో పడ్డ షణ్ముఖ్.. జనవరి 3 న జరిగిన సిరి బర్త్ డే పార్టీకి హాజరై జెస్సి, సిరి లతో కలిసి బాగా ఎంజాయ్ చేసాడని.. కాకపోతే ఆ పార్టీ పిక్స్ బయటికి రాకూండా జాగ్రత్త పడ్డారని, జెస్సి, సిరి లతో కలిసి షణ్ముఖ్ పార్టీ లో హడావిడి చేసాడని అంటున్నారు కానీ తన బ్రేకప్ కి కారణమైన సిరితో షణ్ముఖ్ ఇంకా క్లోజ్ గా ఉండడం మాత్రం నెటిజెన్స్ కి షాకిస్తుంది. 

Deepthi Sunaina Tears - Shanmukh Enjoyment:

Shanmukh Jaswanth attended siri birthday party

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ