నాగార్జున - కళ్యాణ్ కృష్ణ కాంబోలో సోగ్గాడే చిన్న నాయన కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న బంగార్రాజు మూవీ మొదలు పెట్టినప్పటినుండే.. అంచనాలు నమోదు చేస్తుంది. చాలా త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసుకోవడం, అలాగే బంగార్రాజు లుక్స్ విషయంలో ఆసక్తిని క్రియేట్ చెయ్యడం, సాంగ్స్, నాగ చైతన్య - కృతి శెట్టిల రొమాన్స్ అన్ని సినిమాపై అంచనాలు పెంచుతూనే ఉన్నాయి. బంగార్రాజు షూటింగ్ స్టార్ట్ చెయ్యడమే.. ప్రమోషన్స్ స్టార్ట్ చేసేసింది టీం. సంక్రాంతి టార్గెట్ గా ప్రమోషన్స్ మొదలు పెట్టిన మేకర్స్.. సినిమా రిలీజ్ డేట్ విషయాన్నీ మాత్రం సస్పెన్స్ లో పెట్టారు. అది ఈ రోజు బుధవారం బంగార్రాజు ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించారు.
అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ బంగార్రాజు సంక్రాంతికి అన్ని వర్గాల ప్రేక్షకులకు ఫుల్ మీల్ ఫీస్ట్ అందించడానికి సిద్ధంగా ఉంది అని.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బంగార్రాజు జనవరి 14న పండుగకు థియేటర్లలోకి రానుంది. సంక్రాంతికి విడుదలైన సోగ్గాడే చిన్ని నాయనా పండుగకు బాక్సాఫీస్ విజేతగా నిలిచింది. ఇప్పుడు, బంగార్రాజు చరిత్రను తిరగరాయడం ఖాయం, ఎందుకంటే పండుగ సీజన్‌లో సినిమా అభిమానులకు ఫ్యామిలీ చిత్రాలు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. మరి నాగ చైతన్య, నాగార్జున, రమ్యకృష్ణ, కృతి శెట్టి కలయికలో జాతి రత్నాలు ఫేమ్ ఫారియా అబ్దుల్లా స్పెషల్ అట్రాక్షన్ గా రాబోతున్న బంగార్రాజు పక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో.. సంక్రాంతికి ఈ సినిమా బెస్ట్ అని చెప్పేస్తున్నారు ఫ్యామిలీ ఆడియన్స్.