ప్రెజెంట్ ఢీ డాన్స్ సీజన్ 14 లో పస లేదు, మజా లేదు, క్రేజ్ లేదు.. ఈమాట అంటున్నది ఎవరో కాదు.. డాన్స్ ప్రియులు. ఢీ డాన్స్ షో ని కపుల్స్ తో వేరే లెవల్ కి తీసుకువెళ్లిన మల్లెమాల యాజమాన్యం.. ఇప్పుడు డల్ గా చప్పగా మార్చేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కారణం కపుల్ యాంకర్స్ ని పెట్టకుండా మెల్ యాంకర్స్ తో ఇంట్రెస్ట్ లేకుండా చేస్తున్నారు అనేది వాళ్ళ ఆవేదన. లాస్య - రవి జంటగా ఢీ డాన్స్ షో ని ఓ లెవెల్ కి తీసుకువెళితే తర్వాత రష్మీ - సుధీర్ జోడి నెక్స్ట్ లెవెల్ చూపించింది. కానీ ఇప్పుడు అలాంటి జోడి కనిపించడం లేదు. స్టేజ్ అంతా మెల్ యాంకర్స్ తోనే నింపేశారు. డాన్స్ పెరఫార్మెన్సెస్ వేరే లెవెల్.. కానీ కామెడీనే పండడం లేదు.
సరే సుధీర్ మానేశాడో.. తీసేసారో మాకెందుకు.. కనీసం.. ఆ రవి కృష్ణ ప్లేస్ లో అయినా, మరో యాంకర్ అఖిల్ ప్లేస్ లో అయినా ఓ గ్లామర్ యాంకర్ ని తీసుకురండి. ఇప్పుడు ఉన్న ఆ లేడీ యాంకర్ ని చూస్తేనే చిరాకు వేస్తుంది.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజెన్స్. ప్రియమణి, నందిత శ్వేతా జెడ్జెస్ గా ఏం గ్లామర్ చూపిస్తారు.. మాకు డాన్స్ షో స్టేజ్ పై గ్లామర్ కావాలి, కలర్ ఫుల్ జోడి కావాలి అంటూ డిమాండ్ చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది.. మరి మల్లెమాల యాజమాన్యం ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే బెటర్..