Advertisementt

వారసులకు కనీసం ఓపెనింగ్స్ వస్తాయా

Thu 06th Jan 2022 10:45 AM
bangarraju,hero,rowdy boys,january 14th,nagarjuna,asish,ashok galla  వారసులకు కనీసం ఓపెనింగ్స్ వస్తాయా
Rowdy Boys, Hero vs Bangarraju వారసులకు కనీసం ఓపెనింగ్స్ వస్తాయా
Advertisement
Ads by CJ

ఆర్.ఆర్.ఆర్ పోస్ట్ పోన్ అయ్యింది.. ఇక మనదే సంక్రాంతి పండగ అంటూ ఇండస్ట్రీ వారసులు హడావిడిగా రిలీజ్ డేట్స్ ప్రకటించి మరీ డేట్స్ బుక్ చేసేసారు. ఇండస్ట్రీ నుండి వారసులుగా తెరకు పరిచయమవుతున్న ఆ డెబ్యూ హీరోలు పండగ కలిసొస్తుంది.. సంక్రాతి అంటే పెద్ద పండగ.. ఎలాగూ రాధే శ్యామ్ కూడా వాయిదా గ్యారెంటీ అనుకుని రంగంలోకి దిగిపోయారు. రాధే శ్యామ్ వాయిదా ఊరటనిచ్చినా..  అక్కినేని నాగార్జున బంగార్రాజు తో అడ్డం పడ్డారు. క్రేజీ ప్రమోషన్స్ తో నాగార్జున బంగార్రాజు కూడా జనవరి 14 అంటే డెబ్యూ హీరోలు, వారసులు బుక్ చేసుకున్న భోగి రోజునే వస్తున్నారు.

ఓ పక్క బంగార్రాజు, మరోపక్క కరోనా వేరియెంట్స్ తో నైట్ కర్ఫ్యూస్ అంటూ హడావిడి. ఈమద్యలో వారసులు ఎటు కాకుండా నలిగిపోతారేమో అనిస్తుంది. అసలే సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా, మరోపక్క బడా నిర్మాత దిల్ రాజు అన్న కొడుకు ఆశిష్ లు.. ఇప్పటివరకు ఈ హీరోలిద్దరూ డేట్స్ ఇవ్వడమే ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు. కానీ ఇప్పుడు ఈ హీరోలిద్దరికి కనీసం ఓపెనింగ్స్ వస్తాయా అనే అనుమానాలు మొదలయ్యాయి. మరి మహేష్ మేనల్లుడు అంటే సాదా సీదా కాదు. అలాగే దిల్ రాజు వారసుడు అన్నా మాములు విషయం కాదు. అశోక్ గల్లా హీరో సినిమాతో, ఆశిష్ రౌడీ బాయ్స్ తో తెరంగేట్రం చేస్తున్నారు. చూద్దాం వారి ఫ్యూచర్ ఈ సినిమాలు ఎలా డిసైడ్ చేస్తాయో అనేది. 

Rowdy Boys, Hero vs Bangarraju:

Bangarraju and Hero and Rowdy Boys arriving on January 14th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ