డిసెంబర్ 2 న బాలకృష్ణ అఖండ మూవీ తో థియేటర్స్ దగ్గర గర్జించారు. అఖండ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తో స్టిల్ ఇప్పటికీ థియేటర్స్ లో దూసుకుపోతుంది. ఇక అల్లు అర్జున్ కూడా పుష్ప అంటూ ఐదు భాషల్లో డిసెంబర్ 17 న దిగాడు. మిక్స్డ్ టాక్ తోనే బ్రహ్మాండమైన కలెక్షన్స్ కొల్లగొట్టిన పుష్ప సినిమాకి హిందీ లో రోజురోజుకి కలెక్షన్స్ పెరిగినా.. మిగతా భాషల్లో రోజు రోజుకి కలెక్షన్స్ పడిపోతున్నాయి. అందుకే మేకర్స్ పుష్ప ని త్వరగా ఓటిటి లో రిలీజ్ చేసేందుకు అమెజాన్ ప్రైమ్ తో ఒప్పందం కుదుర్చుకుని.. జనవరి 7 అంటే రేపు శుక్రవారం పుష్ప మూవీని అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేసేస్తున్నారు. దానికి పుష్ప కలెక్షన్స్ పడిపోవడమే కారణం. అందుకే మేకర్స్ గబగబా పుష్ప థియేటర్స్ రిలీజ్ అయిన 20 రోజులకే తొందరపడ్డారు.
అయితే అఖండ మూవీ డిసెంబర్ 3న రిలీజ్ అయినా ఇప్పటికి మేకర్స్ కి కలెక్షన్స్ కుమ్మెయ్యడంతో.. దానిని కొన్న హాట్ స్టార్ కూడా వెనక్కి తగ్గేలా మేకర్స్ మేనేజ్ చేసారని.. అందుకే అఖండ రిలీజ్ అయిన నెలన్నరకి ఓటిటికి ఇస్తున్నారు. పండగకి అఖండ మూవీ ఓటిటిలో వచ్చేస్తుంది అన్నప్పటికీ.. అఖండ మూవీ ఈ నెల 21 న హాట్ స్టార్ నుండి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సో పుష్ప కి అలా.. అఖండ కి ఇలా మేకర్స్ ప్లాన్ చేసుకున్నారన్నమాట.