బిగ్ బాస్ బిగ్ బాస్.. బిగ్ బాస్ సీజన్ 5 ముగిసినా.. ఇంకా బిగ్ బాస్ న్యూస్ లకి ఫుల్ స్టాప్ పడడం లేదు. కారణం బిగ్ బాస్ సీజన్ 5 ముగిసిన రెండు నెలలకే సీజన్ 6 మొదలు కాబోతున్నది ఒకటైతే.. బిగ్ బాస్ నుండి వచ్చాక టాప్ 5 లో ఉన్న సిరి - షణ్ముఖ్ లు విపరీతంగా ట్రెండ్ అవుతున్నారు. షణ్ముఖ్ కి గర్ల్ ఫ్రెండ్, లవర్ దీప్తి సునయన బ్రేకప్ చెప్పెయ్యడం సెన్సేషన్ అయ్యింది. సిరి - షణ్ముఖ్ ల ఫ్రెండ్ షిప్ భరించలేని దీప్తి ఇలాంటి నిర్ణయం తీసుకుంది. ఇక తర్వాత సిరి బాయ్ ఫ్రెండ్ కూడా సిరి కి బ్రేకప్ చెప్పబోతున్నాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
సిరి కి బర్త్ డే రోజున విష్ చేసిన ప్రియుడు శ్రీహన్.. తాజాగా సోషల్ మీడియాలో ఆమెతో కలిసి ఉన్న ఫొటోస్ ని డిలేట్ చెయ్యడం చర్చనీయాంశం అయ్యింది. షణ్ముఖ్ తో సిరి క్లోజ్ గా ఎమోషనల్ గా మూవ్ అవడం ఆమె బాయ్ ఫ్రెండ్ కి నచ్చకపోవడంతో అతను కూడా సిరి తో తెగ తెంపులు చేసుకోవడానికే ఆమె ఫొటోస్ డిలేట్ చేస్తున్నదంటున్నారు.. ఏ క్షణాన అయిన.. సిరితో అతను రిలేషన్ కట్ అవ్వొచ్చని అంటున్నారు. మరి సిరి - ఆమె బాయ్ ఫ్రెండ్ శ్రీహన్ మధ్యలో ఏం జరుగుతుందో అనే కన్ఫ్యూజన్ లో ఇప్పుడు నెటిజెన్స్ ఉన్నారు.