ఒక్కోసారి పరిస్థితులు ప్రభావం వల్ల కొందరి నటులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ కోవలోకే వస్తారు సీనియర్ నటుడు బ్రహ్మాజీ. ఈ కమెడియన్ మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పండగకి రిలీజ్ అవుతున్న మూడు సినిమాల్లో మూడు విభిన్న పాత్రాలు వేస్తున్నారు. సిద్ధూ జొన్నలగడ్డ నటించిన డి జె టిల్లు సినిమాలో ఒక ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. ఇది చాలా హిలేరియస్ గా ఉంటుంది అంటున్నారు. అలాగే నాగార్జున నటించిన బంగార్రాజు చిత్రం లో బ్రహ్మాజీ ఇంకో కీలక రోల్ ప్లే చేస్తున్నాడు. ఇందులో కూడా కామెడీ నే. వెన్నెల కిషోర్ మరియు బ్రహ్మాజీ మధ్య వచ్చిన సీన్స్ చాలా బాగా వచ్చాయి అని చెప్పుకుంటున్నారు.
ఇంక మూడో సినిమా గల్లా అశోక్ నటించిన హీరో. ఇందులో బ్రహ్మాజీ కేవలం క్లైమాక్స్ లో వస్తారు అని వినికిడి. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య కి బ్రహ్మాజీ సెంటిమెంట్, అందుకని, అతని సినిమాలో చిన్న రోల్ అయినా వేయించాలని, ఈసారి క్లైమాక్స్ లో వచ్చేట్టు ప్లాన్ చేసారు. ఇంకేముంది ఈసారి పండగంతా బ్రహ్మాజీ నే. ఇందులో రెండు సినిమాలు హీరో, డి జె టిల్లు పండగ రేస్ లో లేవు. కానీ రెండు పెద్ద సినిమాలు రిలీజ్ వాయిదా పడటం తో ఈ రెండు ఆ రెండిటి ప్లేస్ లో వచ్చాయి. ఇంకేముంది మన బ్రహ్మాజీ అదృష్టమే అదృష్టం.