ఆంధ్రాలో అసలే టికెట్ రేట్స్ తగ్గించారు అని తెలుగు సినిమా పరిశ్రమ వాళ్ళు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మీద గుర్రుగా ఉంటే, ఇప్పుడు ఇంకో దెబ్బ పడింది. రేపటి నుండి అంటే జనవరి 8 వ తేదీ నుండి ఆంధ్ర లో నైట్ కర్ఫ్యూ అంట. అంటే రాత్రి పది గంటల నుండి తెల్లవారు జాము అయిదు వరకు కర్ఫ్యూ. దీని వల్ల సినిమా హాల్స్ లో సెకండ్ షో వెయ్యడానికి కుదరదు. ఇదే కాదు, సినిమా హాల్స్ లో రేపటి నుండి 50 శాతం మాత్రమే సీట్స్ ఆక్యుపెన్సీ ఉండాలని ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు. అంటే ఇంకో దెబ్బ పడింది అన్నమాట.
పెద్ద సినిమాలన్నీ తమ విడుదల తేదీ వాయిదా వేసి ఊరుకున్నారు, మరి కొన్ని చిన్న సినిమాలు ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి కదా. మరి వాటి పరిస్థితి ఏంటి. ఎలా ఇన్ని అడ్డంకులతో ఆ చిన్న సినిమాలు అయినా నిలబడతాయా? మరి మన నాగార్జున గారు ఇప్పుడు ఏమంటారో? అతని బంగార్రాజు సినిమా కూడా పండగ బరిలో వుంది కదా. తన మిత్రుడు జగన్ ఏమి చేసినా, నాగార్జున వూ కొడతారు తప్ప ఊహు అన్నారు కదా!