నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్ లో సినిమా వస్తోంది అంటే భయపడుతున్నారట. భయం అంటే దిల్ రాజు ఎదో చేస్తాడని, లేదా కఠినంగా వ్యవహరిస్తాడని కాదండి బాబు. దిల్ రాజు అందరికి డబ్బులు ఎగనామం పెడతాడట. అందుకే దిల్ రాజు ప్రొడక్షన్ ఆఫీస్ నుండి కాల్ వచ్చింది అంటే చాలట, చాలామంది యాక్టర్స్, టెక్నిషన్స్ కొంచెం టెన్షన్ ఫీల్ అవుతారట. దిల్ రాజు పెద్ద నిర్మాత, చెయ్యకపోతే ఒక బాధ, చేస్తే డబ్బులు సరిగ్గా ఇవ్వడు. ఏమి చెయ్యలేక, బయటకి చెప్పుకోలేక చాలామంది ఆర్టిస్ట్స్, టెక్నిషన్స్ నలిగిపోతున్నారట.
అందుకే దిల్ రాజు ప్రొడక్షన్ అంటే చాలు భయం పుట్టుకుంది. దిల్ రాజు ఇప్పుడు దర్శకుడు శంకర్ మరియు రామ్ చరణ్ కాంబినేషన్ లో ఒక పాన్ ఇండియా సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ఖర్చు కూడా చాలా ఎక్కువే కదా మరి. అయితే దిల్ రాజు ఈ ఖర్చు తగ్గించుకోటానికి పాపం చిన్న చిన్న వాళ్ల పేమెంట్ ఆపేస్తున్నాడని టాక్. అదీ కాకుండా తెలంగాణాలో అన్నీ తానే అయినట్టుగా ఫీల్ అయిపోతున్నాడు ఈమధ్య. ఆ భావం రాను రాను మరీ ఎక్కువ అయ్యింది దిల్ రాజు కి.