Advertisementt

శ్రీకాంత్ అడ్డాల తదుపరి సినిమా?

Sat 08th Jan 2022 01:54 PM
srikanth addala,new movie,director srikanth addala,next project,narappa,miryala ravindra reddy  శ్రీకాంత్ అడ్డాల తదుపరి సినిమా?
Srikanth Addala next film? శ్రీకాంత్ అడ్డాల తదుపరి సినిమా?
Advertisement
Ads by CJ

మనకున్న సున్నితమయిన దర్శకుల్లో శ్రీకాంత్ అడ్డాల ఒకరు. అయితే సరి అయిన టైం లో సరి అయిన సినిమాలు పడకపోవటం వల్ల పాపం కొంచెం దెబ్బ తిన్నాడు శ్రీకాంత్. తన రెండో సినిమానే ఒక పెద్ద మల్టీ స్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తీసి పెద్ద హిట్ కొట్టాడు. తన సినిమాల్లో అస్లీలతకి అస్సలు తావు ఇవ్వడు. వెంకటేష్ తో అతను చేసిన నారప్ప గత ఏడాది ఓ టి టి లో విడుదల అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు శ్రీకాంత్ తన తదుపరి సినిమాతో ఒక కొత్త యాక్టర్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. 

రీసెంట్ గా బాలకృష్ణ తో అఖండ సినిమా తీసి సంచలనం సృష్టించిన నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి తన బావ మరిదిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడట. దానికి శ్రీకాంత్ అడ్డాల ని దర్శకుడిగా తీసుకున్నాడట. ఈ సినిమా ఈ ఫిబ్రవరి లేక మార్చ్ లో మొదలవుతుందని భోగట్టా.  శ్రీకాంత్ మొత్తం బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేసాడట ఈ సినిమా కోసం. ఇంక అధికారిక అనౌన్స్ మెంట్ రావడమే తరువాత షూటింగ్ మొదలెట్టడం జరుగుతుంది.

Srikanth Addala next film?:

Srikanth Addala to announce his next project after Narappa?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ