Advertisementt

కృతి శెట్టి డిమాండ్ నిజమేనా

Tue 11th Jan 2022 12:19 PM
krithi shetty,banagarraju,nithin,nani,shyam singha roy,macharla niyojaka vargam,demands 2 crores,remuneration,bangarraju  కృతి శెట్టి డిమాండ్ నిజమేనా
Krithi Shetty demands Huge Remuneration for Bangarraju కృతి శెట్టి డిమాండ్ నిజమేనా
Advertisement
Ads by CJ

ఉప్పెన సినిమాతో బేబమ్మ గా క్యూట్ గా ట్రెడిషనల్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి రెండో సినిమా శ్యామ్ సింగ రాయ్ తోనూ మంచి హిట్ కొట్టింది. కృతి శెట్టి రేంజ్ పెరిగిపోయింది. వరస సినిమాలతో ఈ యంగ్ హీరోయిన్ కళకళలాడుతుంది. యంగ్ హీరోలతో వరసబెట్టి సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం కృతి శెట్టి నటించిన బంగార్రాజు మూవీ మరో రెండు రోజుల్లో రిలీజ్ కాబోతుంది. బంగార్రాజు లో నాగలక్ష్మి గా ట్రెడిషనల్ లుక్ లో కృతి శెట్టి అదరగొడుతుంది. అటు బంగార్రాజు మూవీలోనే కాదు, బంగార్రాజు ప్రమోషన్స్ లోను నాగార్జున, నాగ చైతన్య తో కలిసి లంగా ఓణీ, సారీస్ తో సందడి చేస్తుంది. చుడి దార్లు లోను క్యూట్ గా ప్రమోషన్స్ లో పాల్గొంటూ అందరి చూపు తన మీద పడేలా చేసుకుంటుంది. అయితే బంగార్రాజు మూవీ కోసం కృతి శెట్టి బంగార్రాజు మేకర్స్ ని భారీగా పారితోషకం డిమాండ్ చేసింది అనే న్యూస్ ఉంది.

కృతి శెట్టి భారీగా డిమాండ్ చేసింది అనే విషయాన్నీ బంగార్రాజు మూవీ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఓ ఇంటర్వ్యూలో లీక్ చేసేసారు. అంటే కృతి శెట్టి బంగార్రాజు మూవీ కోసం పర్ఫెక్ట్ అని, ఆమెని సంప్రదించామని, అప్పుడు పారితోషకం విషయం గురించి ఏం అనుకోలేదని, కృతి శెట్టి కూడా నాగ లక్ష్మి పాత్రని ఓకె చేసింది అని, ఆ తర్వాత కృతి శెట్టి అడిగింది ఇవ్వాల్సి వచ్చింది అంటూ చెప్పారు. అంటే కృతి శెట్టి నిజంగానే బంగార్రాజు 2 కోట్ల పారితోషకం డిమాండ్ చేసి మరీ పిండేసింది అన్నమాట. అంతేలే.. నితిన్ మాచవరం నియోజక వర్గం, సుధీర్ బాబు సినిమాలు హిట్ అయితే అమ్మడు అందనంత పారితోషకానికి ఎగబాకేస్తుంది.

Krithi Shetty demands Huge Remuneration for Bangarraju:

Krithi Shetty demands 2 Crores Remuneration for Bangarraju

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ