నయనతార, దీపికా పడుకొనే, సమంత వీళ్ళందరికీ సరిపోయే విషయం ఒకటి వుంది. ఈ నటీమణులంతా మానసిక బాధలు ఇబ్బందులనుండి బయట పడ్డం అని చెప్పుకున్నవాళ్ళే. అప్పట్లో నయనతార ఇలానే మాట్లాడేది. ఆ తరువాత హిందీ నటీమణుల్లో దీపికా కూడా ఈ మానసిక బాధ గురించి మాట్లాడింది. ఇప్పుడు సమంత కూడా ఇదే విషయాన్ని మాట్లాడుతోంది. మీరు గమనించారా ముగ్గురూ మానసిక ఇబ్బంది గురించే మాట్లాడేటప్పుడు వాళ్ళు ఒక రిలేషన్ షిప్ లేక వివాహానికి సంబంధించి బాధల్లో వున్నారు. నయనతార అప్పట్లో ఎప్పుడూ వార్తల్లో ఉండేది, శింబు అవనివ్వండి లేదా ప్రభు దేవా అయినా, ఎప్పుడూ వార్తల్లో ఉండేది. ఇప్పుడు మెల్లగా సెటిల్ అయింది.
దీపికా కూడా అంతే కదా. ఇప్పుడు అంటే రణ్వీర్ ని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపొయింది. సమంత కూడా ఇప్పుడు మానసిక ఇబ్బందుల గురించి మాట్లాడుతోంది. చైతన్య తో విడిపోయాక ఆమెని సోషల్ మీడియా లో అందరూ బాగా నెగటివ్ గా మాట్లాడారు. సమంత ఇవేమి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతూ వుంది. అయితే వీరందరూ స్ట్రాంగ్ మరియు పని మీద ఫోకస్ పెట్టి మళ్ళీ మామూలు అయ్యారు. ఏది ఏమైనా ఒక సంబంధం పెట్టుకోవటం లేదా వివాహం చేసుకోవటం అనే విషయం జీవితం లో కొత్త మార్పుని తీసుకొస్తుంది. దానికి అనుగుణంగా మనం అలవాటు పడాలి. లేదంటే మానసిక ఇబ్బందులు తప్పవు మరి... దానికి డాక్టర్స్ కూడా ఏమి చెయ్యలేరు, మళ్ళీ వాళ్ళంతట వాళ్లే మామూలు దారిలోకి రావాలి..