బాలీవుడ్ లో క్రేజీ మూవీస్ తో తనకంటూ ఓ స్పేస్ ని సంపాదించుకున్న రకుల్ ప్రీత్ సింగ్.. ప్రస్తుతం తెలుగులో సినిమాలేమి చెయ్యడం లేదు. ఆమె ఒప్పుకోవడం లేదు అనేకన్నా.. రకుల్ కి అవకాశాలు ఏవి రావడం లేదనే చెప్పాలి. రకుల్ ప్రీత్ ని టాలీవుడ్ లైట్ తీసుకుంది అనే చెప్పాలి. బాలీవుడ్ లో బిజీ అయిన రకుల్ గ్లామర్ విషయంలో ఏ మాత్రం తగ్గదు. క్లివేజ్ షో తో ఈ మధ్యన రకుల్ ప్రీత్ సోషల్ మీడియాలో అదరగొట్టేస్తుంది. సోషల్ మీడియాలో వారానికో గ్లామర్ ఫోటో ని పోస్ట్ చేస్తూ యూత్ ని హీటెక్కించింది. తాజాగా పోస్ట్ చేసిన ఫోటో చూస్తే మాత్రం మతులు పోతాయి.
రకుల్ ప్రీత్ యోగా చేస్తున్న పిక్ అది. టైట్ ఫిట్ లో గ్లామర్ గా రకుల్ ప్రీత్ చేసే యోగా చూస్తే అమ్మో అందం కోసం, గ్లామర్ కోసం ఎన్ని కష్టాలో అంటారు. ఆరోగ్యం కోసం, అందం కోసం, సన్నగా స్లిమ్ గా ఉండడానికి హీరోయిన్స్ కి ఈ కష్టాలు మాత్రం తప్పవు. చీరతో కాళ్ళని పైకి ఎత్తి, తాళ్లు పట్టుకుని రకుల్ చాలా కష్టమైన యోగాసనం వేస్తుంది. ఆరెల్ యోగా అంటూ రకుల్ ప్రీత్ షేర్ చేసిన ఈ యోగా పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.