అల్లు అర్జున్ చాలా హ్యాపీ గా వున్నారు. ఆయన నటించిన పుష్ప సినిమా ఈ మధ్యనే రిలీజ్ అయ్యి గొప్ప సక్సెస్ అవడమే కాకుండా అల్లు అర్జున్ ని పాన్ ఇండియన్ యాక్టర్ ని చేసింది. సినిమా రిలీజ్ కి ముందు, తరువాత అల్లు అర్జున్ ఆ సినిమా గురించి చాలా ప్రమోషన్స్, పార్టీస్ అంటూ ఎడతెరిపి లేకుండా తీరిక కూడా లేకుండా పార్టిసిపేట్ చేసాడు. సినిమా రిలీజ్ అయ్యే చివరి నిమిషం వరకు, షూటింగ్, డబ్బింగ్, ప్రమోషన్స్ అంటూ రిలీజ్ అయ్యాక ఏ భాషలో పుష్ప పెరఫార్మెన్స్ ఎలా ఉందో అనే టెంక్షన్ తో అల్లు అర్జున్ రాత్రి పగలు తీరిక లేకుండా గడిపాడు.
అందువల్ల ఇప్పుడు అల్లు అర్జున్ బ్రేక్ తీసుకోవాలి అనుకున్నాడు. అందుకే ఈ మంగళవారం అల్లు అర్జున్ తన కుటుంబం తో సహా దుబాయ్ వెళ్ళాడు. సంక్రాంతి పండగ కూడా అక్కడే సెలెబ్రేట్ చేసుకుందామని అనుకుంటున్నాడట. నిన్న మంగళవారం దర్శకుడు సుకుమార్ పుట్టిన రోజు కూడా కావటం తో ఆయన్ని వ్యక్తిగతంగా కలిసి శుభాకాంక్షలు చెప్పాలని అల్లు అర్జున్ ఇప్పటి వరకు వెయిట్ చేసి , నిన్న ఉదయం దుబాయ్ వెళ్ళాడు. సుకుమార్ పుష్ప అనే సినిమాతో అల్లు అర్జున్ కెరీర్ ని మరో మలుపు తిప్పాడు.