శింబు - నిధి అగర్వాల్ జంట, వాళ్ళమద్యలో లవ్ ఎఫ్ఫైర్ ఉంది అని ఎలా తమిళ నాట వినపడుతోందో, అలాగే తెలుగు నాట విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న జంట పేరు వినపడుతోంది. విశేషం ఏమిటంటే.. ఈ జంట తమకి తెలియకుండానే ఒకరి బ్రేక్ అప్ కి ఇంకొకరు హెల్ప్ చేసుకున్నారు. రష్మిక కన్నడ యాక్టర్ రక్షిత్ శెట్టి తో బ్రేక్ అప్ అవ్వటానికి విజయ్ దేవరకొండ కారణం. ఎలా అంటారా.. విజయ్ రష్మిక ల గీత గోవిందం సినిమా ముద్దు సీన్ వీడియో బయటకి రావటమే. వీరిద్దరూ జంటగా డియర్ కామ్రేడ్ కూడా చేసారు.. ఇందులో కూడా చాలా ఇంటిమసీ తో చేసారు.. ఆ వీడియో చూసి రక్షిత్ శెట్టి బ్రేక్ అప్ చెప్పేసాడు.
ఆ డియర్ కామ్రేడ్ సినిమా తర్వాతే రష్మిక, విజయ్ దేవరకొండ తో చనువుగా ఉంటూ కనపడుతోంది... అదీ కాక విజయ్ ఇంటికి తరుచూ వెళ్ళేది.. విజయ్ కుటుంబ సభ్యుల్లో కలిసిపోయింది. ఇలా రష్మిక విజయ్ తో చనువుగా ఉండటం చూసిన విజయ్ విదేశీ గర్ల్ ఫ్రెండ్ విజయ్ కి బాయ్ చెప్పేసిందట. ఆమధ్య విజయ్ అన్నాడు కదా తాను బ్రేక్ అప్ అయ్యానని.. కారణం చెప్పలేదు అనుకోండి.. కానీ రష్మిక అనే అందరు అన్నారు. ఇప్పుడు విజయ్ - రష్మిక ల జంట గురించి టాలీవుడ్ లో బాగానే చెప్పుకుంటున్నారు.
న్యూ ఇయర్ పార్టీ కి ఇద్దరు గోవా వెళ్ళటం, షూటింగ్స్ లో కలవటం, ఒకరి ఇళ్ళకి ఒకరు తరుచుగా వెళ్ళటం. ఇవన్నీ చూస్తుంటే.. వీళ్ళిద్దరూ తమ రిలేషన్ షిప్ ని కొంచెం ముందుకు తీసుకెళ్లొచ్చు అంటున్నారు.. కానీ ఇద్దరి కెరీర్ ఇప్పుడే పీక్స్ లో వుంది.. అందుకని కొన్ని సంవత్సరాల పాటు ఏమి మాట్లాడకపోవచ్చు అంటున్నారు.