ఈ సంక్రాంతికి పెద్ద సినిమాల హడావిడి లేదు కానీ కుర్ర హీరోలు అందులోను డెబ్యూ వారసుల సందడి ఎక్కువైంది. నాగార్జున - నాగ చైతన్య బంగార్రాజు సినిమా తో పాటుగా.. చిరు చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ సూపర్ మచ్చి, మహేష్ మేనల్లుడు గల్లా అశోక్ హీరో మూవీ, దిల్ రాజు అన్నకొడుకు ఆశిష్ నటించిన రౌడీ బాయ్స్.,. ఇంకొన్ని ఊరు పేరు లేని సినిమాలు ఈ సంక్రాంతి పండగకి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కోవిడ్ కారణంగా పెద్ద సినిమాలు వెనక్కి తగ్గగా.. చిన్న సినిమాల హడావిడి మొదలైపోయింది. ఈ రోజు భోగి సందర్భంగా నాగార్జున బంగార్రాజు, ఆశిష్ రౌడీ బాయ్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అయితే డెబ్యూ హీరోలైన ఆశిష్, అశోక్ గల్లా లు తమతమ సినిమాలతో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. భారీ ప్రమోషన్స్ తో గల్లా హీరో మూవీ, స్టార్స్ ప్రమోట్ చేసిన రౌడీ బాయ్స్ సినిమాతో ఆశిష్ తన లక్కుని పరీక్షించుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ హీరోలిద్దరికి బంగార్రాజు టెంక్షన్ పట్టుకుంది. ఎందుకంటే బంగార్రాజు మూవీ నిజమైన సంక్రాంతి పండగ సినిమాల కనిపించడం, నాగార్జున, నాగ చైతన్య లు బంగార్రాజు ప్రమోషన్స్ లో ట్రెడిషనల్ గా ఆసక్తికరంగా చెయ్యడంతో.. ఆ సినిమాపై మంచి అంచనాలు క్రేజ్ వచ్చేసాయి. ఇక కుర్ర హీరోలు, డెబ్యూలా హీరోల సినిమాలపై ప్రేక్షకుల ప్రభావం ఎలా ఉంటుందో.. నాగార్జున బంగార్రాజు ముందు తమ సినిమాల పరిస్థితి ఏమిటో అంటూ డెబ్యూ హీరోలు టెంక్షన్ పడుతున్నారు.