Advertisementt

వరుణ్ దోశ ని ఉప్మా చేసిన మెగాస్టార్

Fri 14th Jan 2022 01:25 PM
chiranjeevi,varun tej,dosa,chiru,mega family,bhogi celebrations,sankranthi celebrations,varun - chiru dosa  వరుణ్ దోశ ని ఉప్మా చేసిన మెగాస్టార్
Chiranjeevi Jealous Of Varun Tej Dosa వరుణ్ దోశ ని ఉప్మా చేసిన మెగాస్టార్
Advertisement
Ads by CJ

సంక్రాంతి సంబరాలు మెగా ఫ్యామిలిలో అంబరాన్ని తాకాయి. మెగా ఫ్యామిలీ లో భోగి మంటలతో సంక్రాంతి పండుగకి స్వాగతం పలికారు. మెగాస్టార్ చిరు, నాగబాబు ఫ్యామిలీ అంతా కలిసి ఈ భోగి వేడుకలని ఓ రేంజ్ లో మొదలు పెట్టారు. అది కూడా బ్రేక్ ఫాస్ట్ తో మెగా ఫ్యామిలీ భోగి ని సెలెబ్రేట్ చేసుకున్నారు. తెల్లవారి ఝామునే భోగి మంటలతో హడావిడి సందడి చేసిన మెగా స్టార్ ఫ్యామిలీ.. భోగి రోజు ఉదయం వరుణ్ తేజ్ - చిరు కలిసి దోశలు వేస్తూ హడావిడి చేసారు. మెగాస్టార్ చిరు - వరుణ్ తేజ్ పెద్ద స్టవ్ పైన దోశ పేణాలు పెట్టి దోశలు వేస్తున్నారు. అయితే చిరు వేసిన దోశ సరిగ్గా రాలేదు. కానీ వరుణ్ తేజ్ వేసిన దోశ చాలా బాగా వచ్చింది.

దానితో వరుణ్ దోశ చూస్తే కుళ్ళు వచ్చేస్తుంది అంటూ చిరు వరుణ్ దోసని చెడగొట్టేసారు. వరుణ్ దోసని చెడగొట్టేసిన చిరు సరదాగా అది దోశ కాదు ఉప్మా అంటూ ఆటపట్టించారు. ఈ  దోశ వీడియో ని వరుణ్ తేజ్ ఇన్స్టా రీల్ లో పోస్ట్ చేసాడు. వరుణ్ అన్న దోశ అంటూ మెగా ఫ్యామిలీ పిల్లలు అంతా అరుస్తుండగా మెగాస్టార్ చిరు - వరుణ్ తేజ్ ల దోశ బ్రేక్ ఫాస్ట్ అలా సాగింది. నిహారిక తో వరుణ్ తేజ్ సెల్ఫీ అన్ని ఈ భోగి వేడుకల్లో హైలెట్ గా నిలిచాయి. 

Chiranjeevi Jealous Of Varun Tej Dosa:

When Chiranjeevi got jealous of nephew Varun Tej dosa 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ