Advertisementt

సితార వంశి, దిల్ రాజు ని చూసి నేర్చుకోవాలి

Sun 16th Jan 2022 02:47 PM
sithara entertainmen,producer naga vamsi interview,producer naga vamsi,sitara entertainment producer naga vamsi,dil raju  సితార వంశి, దిల్ రాజు ని చూసి నేర్చుకోవాలి
There is a lot to learn from watching Dil Raju సితార వంశి, దిల్ రాజు ని చూసి నేర్చుకోవాలి
Advertisement
Ads by CJ

సితార ఎంటర్టైన్మెంట్ మూడు సినిమాలు రెడీ గా వున్నాయి, ఇంకో నాలుగు సినిమాలు అనౌన్స్ కూడా చేసారు. కానీ ఏమి లాభం, ఒక్క సినిమా కూడా పండక్కి రిలీజ్ చేయలేకపోయారు. పండగకి రావలసిన పెద్ద సినిమాలు తమ విడుదలను వాయిదా వేసాయి, అప్పుడు చిన్న సినిమాలు ముందుకు వచ్చాయి. దిల్ రాజు లాంటి పెద్ద నిర్మాత అనుభవం వుంది కాబట్టి వెంటనే రౌడీ బాయ్స్ అనే సినిమాని రెడీ చేసి పెట్టుకున్నాడు, సంక్రాంతి కి రిలీజ్ చేసేసాడు. మరి సితార ఎంటర్టైన్మెంట్ లాంటి సంస్థ పది సినిమాలు వరకు అనౌన్స్ చేసింది. కానీ ఒక్క సినిమా కూడా పండగకి విడుదల చెయ్యలేకపోయింది. 

దీనికి కారణం ఆ సంస్థలో వంశి లాంటి కుర్ర నిర్మాత ఉండటం, అనుభవం లేకపోవటం అంటున్నారు. ఇలాంటి విషయాల్లో దిల్ రాజు ని చూసి చాలా నేర్చుకోవాలి వంశి అంటున్నారు. ముందు భీమ్లా నాయక్ పండగకి అనుకున్నారు కదా, మళ్ళీ వాయిదా వేశారు. పోనీ అది రెడీ చేసారా లేదు. అలాగే డి జె టిల్లు కూడా అనుకున్నారు, అదీ అయిందా లేదు. అలాగే ఇంకో సినిమా స్వాతి ముత్యం అయినా రెడీ చేయొచ్చు. కానీ ఆ సినిమా కూడా లేదు, ఈ మూడింటిలో ఏ సినిమా పండగకి విడుదల అయినా కుమ్మేసేవి, డబ్బులు వచ్చేవి. కానీ వంశి అనుభవ రాహిత్యం వల్ల ఒక్క సినిమా కూడా విడుదలకి రెడీ చెయ్యలేకపోయాడు. సినిమాలు అనౌన్స్ చెయ్యడం కాదు ముఖ్యం, నిర్మాతకి అవి టైం కి రెడీ చేసి విడుదల చెయ్యటం ముఖ్యం. . 

There is a lot to learn from watching Dil Raju:

Sithara Entertainment has three films ready

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ