నాగార్జున, నాగ చైతన్య కాంబోలో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన బంగార్రాజు సినిమా సంక్రాంతి కి రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యింది. పండగకి పండగలాంటి హిట్ కొట్టిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తన తదుపరి చిత్రం అగ్ర నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్ లో చేయనున్నారు. కెఇ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రానికి నిర్మాత.
దక్షిణాది చలనచిత్ర రంగంలో ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన స్టూడియో గ్రీన్, స్టార్ హీరోలతో హై బడ్జెట్ ఎంటర్టైనర్లను నిర్మించడమే కాకుండా కంటెంట్ రిచ్ సినిమాలను నిర్మిస్తోంది. తెలుగులో కూడా అంతే ప్రజాదరణ పొందిన ఈ బ్యానర్పై నిర్మించిన పలు చిత్రాలు ఇక్కడ డబ్ చేసి విడుదలయ్యాయి.
ఈ సందర్భంగా కెఇ జ్ఞానవేల్ రాజా సోమవారంనాడు మాట్లాడుతూ, సంక్రాంతికి బ్లాక్బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో మా బేనర్లో భారీ సినిమా చేయనున్న విషయాన్ని సంతోషంగా ప్రకటిస్తున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేయనున్నామని తెలిపారు.
పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లను రూపొందించడంలో పేరుగాంచిన కళ్యాణ్ కృష్ణ, బంగార్రాజుతో ఒక ఆదర్శవంతమైన సంక్రాంతి సినిమాతో వచ్చినందుకు ప్రశంసలు అందుకున్నాడు, ఇది భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రానికి సంబందించిన ఇతర వివరాలు త్వరలో స్టూడియో గ్రీన్ వారు వెల్లడించనున్నారు.