అల్లు అరవింద్ తన కొడుకుల్లో ఒకరిని స్టార్ హీరోని చేసారు. అల్లు అర్జున్ స్టార్ హీరోగానే కాదు, పాన్ ఇండియా స్టార్ గా మారారు. ఇక అల్లు బాబీ నిర్మాతగా సినిమాలు చేస్తుంటే.. అల్లు అరవింద్ చిన్న కొడుకు అల్లు శిరీష్ మాత్రం హీరోగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే అల్లు అరవింద్ బిజినెస్ లో మాస్టర్ మైండ్. అందుకే ఓటిటి ప్రాధాన్యత గ్రహించి.. కొంతమంది పార్ట్నర్స్ తో కలిసి ఆహా ఓటిటి స్థాపించారు. ఆహా మొదలైనప్పటినుండి అల్లు అర్జున్ ఆహా ని ప్రమోట్ చేస్తూ దానికి క్రేజ్ తీసుకువస్తున్నాడు. మరి ఆహా ఓటిటి అంటే.. అందులో అల్లు అరవింద్ తో పాటుగా, అల్లు అర్జున్, బాబీ, శిరీష్ కూడా ఉన్నట్టే. కానీ అల్లు శిరీష్ ఇప్పుడు ఆహా గురించి తనని అడగవద్దు అంటున్నాడు.
అంటే అల్లు అర్జున్ , అల్లు అరవింద్ మాత్రమే ఆహా ని చూసుకుంటున్నారా అనే డౌట్ రాక మానదు. అసలు ఇంతకీ విషయం ఏమిటంటే.. ఆహా ఓటిటి సబ్ స్క్రైబర్స్.. ఆహా యాప్ నుండి కొన్ని సమస్యలు ఎదుర్కుంటున్నారు. దానితో వారు సోషల్ మీడియాలో అల్లు అర్జున్, అల్లు శిరిష్ లని టాగ్ చేస్తూ ఆహా సమస్యలను చెప్పుకుంటున్నారు. అలా ఓ ఆహా సబ్ స్క్రయిబర్ తాను ఆహా ఓటిటి నుండి టెక్నీకల్ ఇష్యుస్ ఎదుర్కుంటున్నట్టుగా ఆహా ఓటిటిని టాగ్ చెయ్యడమే కాకుండా, అల్లు శిరీష్ ని టాగ్ చేసాడు. దానితో అల్లు శిరీష్ కాస్త అసహనంగా సదరు సబ్ స్క్రైబర్ కి రీ ట్వీట్ చేస్తూ.. చాలా మంది ఆహాలో ఏదైనా సమస్య వస్తే సోషల్ మీడియాలో తనను ట్యాగ్ చేస్తున్నారని, అందరూ తాను ఆహా బిజినెస్‌లో ఇన్వాల్వ్ అయ్యానని అనుకుంటున్నారని.. ఆహా సబ్ స్క్రైబర్స్ సంబంధించిన ఇటువంటి సమస్యలను ఆహా టీం పరిష్కరించాలంటూ ట్వీట్ చేశాడు.
దానితో అల్లు ఫాన్స్ షావుతున్నారు. అదేమిటి అల్లు అంటేనే ఆహా, ఆహా అంటేనే అల్లు. అలాంటిది అల్లు శిరీష్ కి ఆహా తో సంబంధం లేదా అంటూ ఆశ్చర్యపోతున్నారు. అన్న ప్రమోట్ చేస్తుంటే.. తమ్ముడు పట్టించుకోకపోవడం మాత్రం నిజంగా షాకింగ్ విషయమే.